జగన్ ప్లాన్: చంద్రబాబు టీడీపీకి గడ్డు కాలమే

జగన్ ప్లాన్: చంద్రబాబు టీడీపీకి గడ్డు కాలమే

Naresh Kumar   | Asianet News
Published : Sep 24, 2021, 11:02 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు. చంద్రబాబు వ్యూహాలేవీ ఏపీలో ఫలించడం లేదు. చంద్రబాబు వ్యూహాలకు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతివ్యూహాలు రచిస్తూ అమలు చేస్తున్నారు. రాష్ట్రంలోనే కాకుండా కుప్పంలో కూడా చంద్రబాబును దెబ్బ తీసేందుకు ఆయన వ్యూహాలు రచించి అమలు చేస్తున్నారు. కుప్పంలో కూడా చంద్రబాబు పరిస్థితి నానాటికీ దిగజారుతున్న పరిస్థితి కనిపిస్తోంది.