Oct 6, 2022, 12:37 PM IST
న్యూడిల్లీ : దేశంలోని పలు ప్రాంతాల్లో దసరా వేడుకలు ప్రమాదాలకు దారితీసాయి. ఇలా పశ్చిమ బెంగాల్ లో దుర్గాదేవి విగ్రహ నిమజ్జనానికి వెళ్లి పలువురు నదిలో కొట్టుకుపోగా హర్యానా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో రావణ దహనంలో ప్రమాదం చోటుచేసుకుంది. యూపీలోని ముజఫర్ నగర్ లో రావణ దహనం సమయంలో ఒక్కసారిగా నిప్పురవ్వలు జనాలపైకి దూసుకెళ్లాయి. దహనం కోసం ఏర్పాటుచేసిన రావణాసురిడి బొమ్మలోంచి నిప్పురవ్వలు జనాల్లోకి వెళ్లిపడ్డాయి. అయితే అప్రమత్తమైన ప్రజలు జాగ్రత్త పడటంతో పెనుప్రమాదం తప్పింది. ఇదిలావుంటే జమ్మూ కాశ్మీర్ లో చాలాకాలం తర్వాత రావణ దహనం కార్యక్రమం జరిగింది. శ్రీనగర్ లో ఆర్మి సిబ్బంది, స్థానికుల రావణ దహనం చేపట్టారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇలా శ్రీనగర్ వీధుల్లో రావణ దహన కార్యక్రమం చేపట్టడం ఇదే మొదటిసారి.