రిషబ్ పంత్ ఐపీఎల్ 2025 వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. క్రికెట్ లో ఇప్పటికే పలు రికార్డులు క్రియేట్ చేయడంతో పాటు కొన్ని రికార్డులను బ్రేక్ చేశాడు. కూడా. ఇప్పుడు రిషబ్ పంత్ రికార్డును భారత యంగ్ బ్యాట్స్‌మెన్ ఊర్విల్ పటేల్ బద్దలు కొట్టాడు. పంత్ ఏ రికార్డును ఊర్విల్ బద్దలు కొట్టాడో ఇప్పుడు చూద్దాం.
ఊర్విల్ పటేల్
రిషబ్ పంత్ రికార్డును బద్దలుకొట్టిన ఊర్విల్ పటేల్
26 ఏళ్ల ఊర్విల్ పటేల్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 లో గుజరాత్ తరపున ఆడుతున్నాడు. అయితే, అతను టోర్నీ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించాడు. 28 బంతుల్లోనే సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డు గతంలో 32 బంతుల్లో సెంచరీ చేసిన రిషబ్ పంత్ పేరిట ఉంది. ఇప్పుడు పంత్ రికార్డును ఊర్విల్ పటేల్ బద్దలు కొట్టాడు.
ఊర్విల్ పటేల్
త్రిపురపై మెరిసిన ఊర్విల్ పటేల్
గుజరాత్ తరపున ఆడుతున్న ఊర్విల్ పటేల్ త్రిపురపై ఈ సూపర్ సెంచరీని సాధించాడు. కేవలం 28 బంతుల్లో 100 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. భారత్ తరపున టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా కూడా ఊర్విల్ నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో 35 బంతుల్లో 113 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 12 సిక్సర్లు ఉన్నాయి. అతని సూపర్ ఇన్నింగ్స్‌తో అతని జట్టు 156 పరుగుల లక్ష్యాన్ని 10.2 ఓవర్లలోనే ఛేదించింది.
రిషబ్ పంత్
అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన రిషబ్ పంత్
2018లో ఢిల్లీ తరపున ఆడుతూ హిమాచల్ ప్రదేశ్‌పై అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించాడు రిషబ్ పంత్. అప్పుడు అతను 32 బంతుల్లో 100 పరుగులు చేశాడు. మొత్తంగా 38 బంతుల్లో 116 పరుగుల తన ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 12 సిక్సర్లు బాదాడు. లక్ష్యాన్ని ఛేదిస్తున్నప్పుడే పంత్ ఈ రికార్డు సెంచరీ సాధించాడు. పంత్ సెంచరీ ఇన్నింగ్స్‌తో ఢిల్లీ 145 పరుగుల లక్ష్యాన్ని 11.4 ఓవర్లలోనే ఛేదించింది.
Urvil Patel
ఐపీఎల్ మెగా వేలంలో ఊర్విల్ పటేల్ కు నిరాశ..
కాగా, ఊర్విల్ పటేల్ సెంచరీకి ముందు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ టైటాన్స్‌లో భాగంగా ఉన్నాడు, కానీ అతన్ని ఆ టీమ్ వదులుకుంది. ఈసారి ఐపీఎల్ మెగా వేలంలో కూడా అతడిని ఎవరూ కొనుగోలు చేయలేదు. వేలం రెండవ రోజు, అతను అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, ఉర్విల్‌కి ఐపీఎల్ ఆడే తలుపులు ఇంకా పూర్తిగా మూసుకుపోలేదు. ఇప్పటి వరకు ఏ ఫ్రాంచైజీ అతన్ని సంప్రదించనప్పటికీ భవిష్యత్తులో ఛాన్స్ ఉంది. ఏదైనా జట్టు పర్స్ మిగిలి ఉంటే లేదా ఎవరైనా ఆటగాడు గాయపడినట్లయితే ఐపీఎల్ ఫ్రాంచైజీల నుంచి అతనికి కాల్ రావచ్చు.