నయనతార vs ధనుష్: ఇంకో మాస్ వార్నింగ్

Published : Nov 30, 2024, 07:01 AM IST

నయనతార బయోగ్రఫీ డాక్యుమెంటరీలో 'నానుమ్ రౌడిదాన్' సన్నివేశాలను ఉపయోగించినందుకు ధనుష్, నయనతారపై దావా వేశారు. దీనికి ప్రతిస్పందనగా నయనతార కర్మ సిద్ధాంతం గురించి ఒక పోస్ట్ పెట్టింది, ఇది ధనుష్‌ను ఉద్దేశించినదని భావిస్తున్నారు.

PREV
15
నయనతార vs ధనుష్:  ఇంకో మాస్ వార్నింగ్
Nayanthara, Karma Post , Dhanush Dispute


లేడీ సూపర్ స్టార్ నయతార, హీరో ధనుష్ మధ్య వివాదం ఇప్పుడిప్పుడే క్లియర్ అయ్యేటట్లు లేదు. ఇప్పుడు అది పీక్స్ కు వెళ్లింది. రీసెంట్ గా  నయనతార పుట్టిన రోజు సందర్భంగా ఆమె బయోగ్రఫీ ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ పేరుతో ఒక డాక్యుమెంటరీ రూపంలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కి వచ్చింది.

ఈ డాక్యుమెంటరీలో ‘నానుమ్‌ రౌడిదాన్‌’ సన్నివేశాలను నిర్మాత ధనుష్‌ అనుమతి లేకుండా ఉపయోగించినందుకుగానూ ఇటీవల ఆయన నయనతార దంపతులపై కోర్టులో దావా వేసారు ధనుష్. ఈ నేపధ్యంలో నయనతార తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. 

25
Nayanthara vs Dhanush

‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ డాక్యుమెంటరీలో నయనతార నటించిన ‘నేనూ రౌడీనే’ సినిమాలోని 3 సెకన్ల క్లిప్‌ను వాడారు. దాంతో ఎలాంటి అనుమతి లేకుండా ఆ క్లిప్‌ను వాడుకున్నందుకు కాపీ రైట్ కింద రూ.10 కోట్లు చెల్లించాలని నయనతారకి తొలుత ధనుష్ నోటీసులు పంపించాడు. నేనూ రౌడీనే సినిమాకి నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించగా.. విజయ్ సేతుపతి హీరోగా నటించాడు. ఈ సినిమాకి ధనుష్ ప్రొడ్యూసర్.

35
nayanthara dhanush


డాక్యుమెంటరీ రిలీజ్‌కి ముందే ధనుష్ నోటీసులు పంపగా.. సోషల్ మీడియాలో బహిరంగ లేఖతో నయనతార రిప్లై ఇచ్చింది. ఈ క్రమంలో ధనుష్‌ నుంచి నిరభ్యంతర లెటర్  కోసం చాలా రోజులు వేచి చూశామని.. అతను ఏదో మనసులో పెట్టుకుని ఇలా వేధింపులకి దిగుతున్నట్లు నయనతార అందులో రాసుకొచ్చింది. అలానే చట్టపరంగానే ఆ నోటీసులకి సమాధానమిస్తానని చెప్పింది.

45
Nayanthara Controvery


అంతే కాకుండా డాక్యుమెంటరీలోనూ ఆ క్లిప్‌ను అలానే నయన్ కొనసాగించింది. దాంతో ధనుష్ రోజుల వ్యవధిలోనే తన లాయర్ ద్వారా వరుసగా నోటీసులు పంపించాడు. ఈ నేపథ్యంలో.. నయనతార మళ్లీ ఘాటుగా రియాక్ట్ అయ్యింది. అయితే.. ఈసారి అతని పేరుని ప్రస్తావించలేదు. కానీ.. ఆ మాటలు మాత్రం ధనుష్‌కే కనెక్ట్ అవుతున్నాయి.

55
Nayanthara


పాత్ర ఏదైనా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న  నయనతార. తాజాగా ఆమె కర్మ సిద్ధాంతాన్ని ఉద్దేశించి ‘‘మీరు ఒకరి జీవితాన్ని అబద్ధాలతో నాశనం చేయాలని చూస్తే దానిని అప్పుగా భావించండి.. అది రెట్టింపు వడ్డీతో తిరిగి వస్తుంది’’ని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.  ఈ కొటేషన్ ధనుష్‌ని ఉద్దేశించేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సౌత్‌లో ఇప్పటికీ టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న నయనతార.. 

click me!

Recommended Stories