పుష్ప 2: తెలుగు ఎంతొస్తే బ్రేక్ ఈవెన్?, మామూలు టార్గెట్ కాదు

First Published | Nov 30, 2024, 6:15 AM IST

డిసెంబర్ 5న విడుదల కానున్న 'పుష్ప 2' సినిమాకు భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 220 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కావాలంటే రూ. 450 నుంచి 500 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించాల్సి ఉంటుంది.

Allu Arjun, #Pushpa2, Sukumar


డిసెంబరు 5న 'పుష్ప 2' వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు బోలెడంత బజ్ వచ్చింది. పాజిటివ్ టాక్ వస్తే చాలు రూ.1000 కోట్ల వసూళ్లు పక్కా అని అంటున్నారు.  ఇక ఈ చిత్రం ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్ కి సిద్ధంగా ఉంది.  

తెలుగుతోపాటూ తమిళ్, మలయాళం, హిందీ తదితర ఫ్యాన్ ఇండియా భాషలలో రిలీజ్ కాబోతోంది. ఈ నేపధ్యంలో తెలుగులో  ఈ చిత్రాన్ని భారీ రేట్లుకే అమ్మారు. దాంతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ అనిపించుకోవాలంటే ఎంత షేర్ రాబట్టుకోవాలి అనేది మీడియా వర్గాల్లో, అభిమానుల్లో  హాట్ టాపిక్ గా మారింది.

Allu Arjun, #Pushpa2, sukumar


మొదట తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే...ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఆంధ్రా ప్రాంతంలో రూ. 90 కోట్లు, నైజాంలో రూ. 100 కోట్లు, సీడెడ్‌లో రూ. 30 కోట్లకు రైట్స్ అమ్ముడు అయ్యాయి. అంటే, మొత్తం రూ. 220 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ‘

పుష్ప 2’లో (Pushpa 2) పాన్ ఇండియా మార్కెట్‌లోనూ పెద్ద హిట్ అవ్వాలంటే మొదట  తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను సాధిస్తే,   అల్లు అర్జున్ కెరీర్‌లోనే బిగ్ రికార్డ్ గా నిలుస్తుంది. మొదటి భాగంలో టికెట్ రేట్ల సమస్య వల్ల  ఇబ్బంది వచ్చినా, ఈసారి నిర్మాతలు మరింత జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. టిక్కెట్ రేట్లును బాగా పెంచుతున్నారు. 

Latest Videos


Allu Arjun, #Pushpa2, Sukumar, #kALKI

జరిగిన బిజినెస్ కు తగినట్లు . 220 కోట్ల షేర్ రూపంలో వెనక్కి వచ్చి లాభాలు రావాలంటే... ‘పుష్ప 2’ తెలుగు రాష్ట్రాల్లో కనీసం రూ. 450  నుంచి 500 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లు ‘ఆర్ఆర్ఆర్’ (RRR) (415 కోట్లు)కి ఉన్నాయి.

దాన్ని దాటాలనేది పుష్ప 2 ప్లాన్ గా ఉంది. ఇనానమస్ గా సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తేనే  పుష్ప2 ఆ ఫీట్ చెయ్యగలుగుతుంది. టిక్కెట్ రేట్లు కూడా కీలకమైన పార్ట్ ప్లే చేస్తాయి. మొదటి పది రోజులు డ్రాప్ అవ్వకుండా కలెక్షన్స్ ఉంటే అనుకున్నట్లుగా సినిమా రీచ్ ఉంటుందనేది నిజం. 

Allu Arjun, #Pushpa2, sukumar, #kALKI


అయితే  ‘పుష్ప 2’కు బ్రేక్ ఈవెన్ సాధించాలంటే  అంత ఈజీ కాదని ట్రేడ్ అంటోంది. ఇది మామూలు టార్గెట్ కాదు. టికెట్ రేట్లు పెంచినా, మొదటి రెండు వారాల్లో ఈ స్థాయి వసూళ్లు అందుకోవడం  చాలా కష్టమని ట్రేడ్ లెక్కలు వేసి చెప్తోంది. అంటే ఎట్టి పరిస్దితుల్లోనూ ‘పుష్ప 2’కు మంచి లాంగ్ రన్ అవసరం. సంక్రాంతి వరకు  థియేటర్లలో  నిలకడగా కలెక్షన్స్ ఉంటే, ఈ టార్గెట్ సాధించగలదు.

Allu Arjun, #Pushpa2, sukumar, #kALKI


ఇవన్నీ గమనించే నిర్మాతలు  ఎక్కడా తగ్గకుండా ప్రమోషన్స్ ని అగ్రెసివ్ గా చేస్తున్నారు. అల్లు అర్జున్ ప్రతి ప్రమోషన్ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తూ అక్కడి ప్రేక్షకులని తన మాటలతో ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.

నెక్స్ట్ ఏపీలో చిత్తూరు జిల్లాలో ‘పుష్ప 2’ ప్రీరిలీజ్ ఈవెంట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దీనికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని చీఫ్ గెస్ట్ గా పిలవాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అందులో నిజం  ఎంత అనేది తెలియాల్సి ఉంది.  
 

తాజాగా ఈ పాన్‌ ఇండియా మూవీ పుష్ప 2 సెన్సార్‌   కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమానికి సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేసింది. ఈ సినిమా నిడివి 3: 18గంటలు ఉన్నట్లు సమాచారం .  రన్‌టైమ్‌ ఎక్కువ ఉన్నా సినిమా మంచి విజయాన్ని అందుకోవచ్చని ‘పుష్ప’ పార్ట్‌ 1 నిరూపించింది. ఆ మూవీ రన్‌టైమ్‌ దాదాపు 3 గంటలు.

దీంతో, పార్ట్‌ 2 నిడివి పార్ట్‌ 1 కంటే కాస్త పెరిగినా ప్రేక్షకులు ఆస్వాదించగలరని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరో సినిమా ప్రచారంలో భాగంగా బుధవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న నిర్మాత నవీన్‌ యెర్నేని సైతం ‘పుష్ప 2’ రన్‌టైమ్‌పై ఇంట్రస్టింగ్ కామెంట్స్  చేశారు. లెంగ్త్ ఎంత ఉన్నా ఇబ్బందేం లేదని, సినిమా చూశాక అసలు దాని గురించే మాట్లాడుకోరని అన్నారు.

Allu Arjun, #Pushpa2, sukumar

పుష్ప 2 విడుదలకు ముందు రికార్డులివీ..

‘పుష్ప 2’ ఇప్పటికే పలు రికార్డులు నెలకొల్పింది. ఓవర్సీస్‌లో అత్యంత వేగంగా 50 వేలకుపైగా టికెట్స్‌ సేల్‌ అయిన చిత్రమిది. ఈ సినిమా ట్రైలర్‌ 150 మిలియన్‌కి పైగా వ్యూస్‌, 3 మిలియన్‌కి పైగా లైక్స్‌ సాధించింది. విడుదలైన 15 గంటలలోపు 40 మిలియన్ల వీక్షణలు పొందిన ఫస్ట్‌ సౌతిండియా మూవీ ట్రైలర్‌గా ఇది నిలిచిన సంగతి తెలిసిందే.

పట్నాలో నిర్వహించిన ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను, తమ అభిమాన నటుడిని ప్రత్యక్షంగా చూసేందుకు రెండున్నర లక్షకుపైగా అభిమానులు వెళ్లడం గమనార్హం. ఆన్‌లైన్‌లోనూ అత్యధిక మంది చూసిన ఈవెంట్‌ ఇదేనని టీమ్‌ పేర్కొంది. ‘బుక్‌ మై షో’లో 1 మిలియన్‌కిపైగా, ‘పేటీఎం’లో 1.3 మిలియన్‌కిపైగా లైక్స్‌ సొంతం చేసుకుంది.

click me!