Why does hair fall out at a young age : సాధారణంగా వెంట్రుకలు రాలడం అనేది వయసు పెరిగేకొద్దీ సంభవిస్తుంది, అయితే ఇది చిన్న వయస్సులో సంభవించినప్పుడు, దాని వెనుక కొన్ని ప్రత్యేక కారణాలు ఉండవచ్చు. చాలా మంది యువత ఇప్పుడు జట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. చిన్న వయస్సులోనే జుట్టు రాలడానికి కారణమయ్యే కొన్ని సాధారణ అంశాలను గురించి వైద్య పరిశోధకులు చెప్పిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Image: Getty
జట్టు రాలడానికి ప్రధానంగా ముందుగా ఉండే అంశం ఒత్తిడి. అధిక ఒత్తిడి శరీరంలో కార్టిసాల్ స్థాయిని పెంచుతుంది, ఇది మీ జుట్టుకు నష్టం కలిగించే హార్మోన్. దీని వల్ల జట్టు రాలిపోతుంది.
అలాగే మీ డైట్ కూడా మీ జట్టుపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం డైట్‌లో ఎక్కువ జంక్ ఫుడ్ వినియోగిస్తున్నారు. దీని వల్ల ప్రోటీన్ తగ్గుతుంది.. పిండి పదార్థాలు పెరుగుతాయి, కాబట్టి ఈ ఆహారం శరీరంలో మంటను కలిగిస్తుంది. ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఇలా కూడా ఇవి మీ జుట్టు రాలడాన్ని పెంచుతుంది.
These mistakes of yours can also cause hair loss
చిన్న వయస్సులోనే జట్టు రాలడానికి ప్రధాన కారణాల్లో స్కాల్ప్ సోరియాసిస్ లేదా హెవీ చుండ్రు వంటి స్కాల్ప్ వ్యాధులు కూడా కారణంగా ఉంటాయి. ఇది త్వరగా జుట్టు రాలడానికి కూడా దారితీస్తుంది.
ధూమపానం ఎక్కువగా చేసేవారిలో జుట్టు రాలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలో తేలింది. జుట్టు ఇప్పటికే పలుచగా ఉన్నవారికి ఎక్కువ ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మీ మొత్తం జీవనశైలి కూడా మీ జట్టుపై ప్రభావం చూపుతుంది. మీరు ఏ సమయానికి నిద్రపోతారు, ఎంత సేపు నిద్రపోతారు, సరైన వ్యాయామం చేస్తున్నారా లేదా, మొత్తం మీద ఎంత ఒత్తిడికి లోనవుతున్నారో, ఇవన్నీ కూడా చిన్న వయసులోనే జుట్టు రాలిపోవడానికి కారణం కావచ్చు.
Hair Loss
అలోపేసియా అరేటా, పోషకాల లోపం లేదా మందుల వాడకం వంటి అనారోగ్య సంబంధిత సమస్య ఫలితంగా కూడా జట్టు రాలిపోతుంది. జుట్టు ఎందుకు రాలుతుందనే విషయాలను పరిగణలోకి తీసుకుని వైద్యులు చికిత్సను అందిస్తారు.
జట్టు రాలడానికి కారణాలలో వృద్ధాప్యం, వంశపారంపర్యత, టెస్టోస్టెరాన్ హార్మోన్‌లో మార్పులకు సంబంధించినదిగా ఉంటుందని వైద్య పరిశోధకలు చెబుతున్నారు. యుక్తవయస్సు వచ్చిన తర్వాత ఎప్పుడైన బట్టతల కొంతమందికి రావచ్చని పేర్కొంటున్నారు.