Dec 10, 2019, 10:21 AM IST
ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఫీజు పెంపు నిరసన ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. పెరిగిన ఫీజులను తగ్గించాలని కోరుతూ రాష్ట్రపతి భవన్ కు ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు. అనంతరం రాష్ట్రపతిని కలిసి ఫీజుపెంపు గురించి మాట్లాడాలనుకున్న విద్యార్థులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఇది లాఠీఛార్జ్ కు దారితీసింది.