హర్యానాలో పెరిగిన ఆడపిల్లల జననాలు

Jan 16, 2020, 10:47 AM IST

రాష్ట్ర ప్రభుత్వ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అందించిన గణాంకాల ప్రకారం హర్యానాలో గత ఐదేళ్లలో నవజాత శిశువుల లింగ నిష్పత్తిలో 52 పాయింట్ల పెరుగుదల నమోదయ్యింది. ఈ డేటా ప్రకారం, రాష్ట్రంలో 2014 లో లింగ నిష్పత్తి ప్రతి 1,000 మంది బాలురకు 871 మంది బాలికలు ఉండగా, 2019 కి వచ్చేసరికి బాలికల సంఖ్య 923కు పెరిగింది.