ఇవెక్కడి ఎన్నికల హామీలురా బాబు: గెలిపిస్తే చంద్రమండలం యాత్ర, ఇంటింటికి

Mar 24, 2021, 7:55 PM IST

చెన్నై: ఎన్నికల్లో గెలుపుకోసం ప్రజలకు రాజకీయ నాయకులు హామీలివ్వడం మనం చూస్తుంటాం. ఎన్నికల సమయంలో అయితే తాయిలాలిచ్చి ఓటర్లను ప్రసన్నంచేసుకునే నాయకులు...గెలిచాక అవిచేస్తాం, ఇవిచేస్తాం అంటూ హామీలిస్తుంటారు. తమను గెలిపిస్తే సంక్షేమ పథకాలు, పెన్షన్లు, ఉద్యోగాలు, నీటిపారుదల ప్రాజెక్టులు, రోడ్లు, తాగునీరు ఇస్తామంటూ చెబుతుంటారు. అయితే ఇలా అందరీలా హామీలిస్తే తన స్పెషాలిటీ ఏముంటుందని భావించాడో ఏమో గానీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఫోటీ చేస్తున్న ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి  విచిత్రమైన హామీలిచ్చాడు.