కర్ణాటకలో బైక్‌తో సహా వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి (వీడియో)

Aug 9, 2019, 4:25 PM IST

బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని గడగ జిల్లాలోని  బుడిహలా గ్రామంలో బైక్‌తో సహా ఓ వ్యక్తి వరద నీటిలో కొట్టుకుపోయాడు. మరో వ్యక్తి వరద నుండి సురక్షితంగా తప్పించుకొన్నాడు. కర్ణాటక రాష్ట్రంలో  భారీ వర్షాలు కురుస్తున్నాయి. బెళగావి జిల్లాలో వరదల కారణంగా జనజీవనం స్థంభించిపోయింది. 

ఇద్దరు వ్యక్తులు వేర్వేరు బైకులపై బుడిహలా గ్రామం గుండా ప్రయాణం చేస్తున్నారు. వరద  ప్రవాహం ఎక్కువ కావడంతో  బైక్ లు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. దీంతో ఓ వ్యక్తి తన బైక్ ను వదిలేసి వరద నీటి నుండి  సురక్షితంగా తప్పించుకొన్నాడు. మరో వ్యక్తి బైక్ ను పట్టుకొని ముందుకు వెళ్లే క్రమంలో వదరలో కొట్టుకుపోయాడు.