Dec 17, 2019, 12:32 PM IST
పచ్చనిమొక్క జీవితాశను పెంచుతుంది. ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొని చిగురించాలన్న స్పూర్తినిస్తుంది. కాలుష్యాన్ని తీసుకుని సంజీవనిని మనకిస్తుంది. అలాంటి మొక్క ఇంట్లో ఒక్కటైనా ఉండాలి.ఇప్పుడు నగరవాసులకు గార్డెనింగ్ మీద ఆసక్తి పెరిగింది. బాల్కనీల్లో, టెర్రస్ మీదా, డాబాల మీదా మొక్కలు పెంచడానికి ఇష్టపడుతున్నారు. అందుకే నగరం అంతటా నర్సరీలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.