ఫాస్ట్‌ట్యాగ్‌ను పక్కన పెట్టేయొచ్చు.. ఇంతకన్నా అప్డేటెడ్ టోల్ సిస్టమ్ వచ్చేస్తోంది

First Published | Dec 15, 2024, 3:43 PM IST

ఇండియాలో ఇకపై టోల్ గేట్ల దగ్గర ఒక్క నిమిషం కూడా ఆగాల్సిన పని లేదు. అలా అని టోల్ టాక్స్ కట్టాల్సిన పని లేదు అనుకుంటున్నారా? అదేం కాదు.  ఫాస్ట్ ట్యాగ్ మాదిరిగానే టోల్ ఆటోమెటిక్ గా మీ అకౌంట్ నుంచి డెబిట్ అయిపోతుంది. అయితే ఈ సిస్టమ్ ఫాస్ట్ ట్యాగ్ కంటే అప్డేటెడ్ వెర్షన్. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ పూర్తిగా చదివేయండి. 
 

మీరు నేషనల్ హైవేపై ప్రయాణించడం ప్రారంభిస్తే చాలు టోల్ ఫీ కట్టాలి. ఇది వసూలు చేయడానికే హైవేలపై చాలా చోట్ల టోల్ గేట్లు ఉంటాయి. ఫాస్ట్ ట్యాగ్ రాకముందు వరకు అయితే టోల్ గేట్ల వద్ద చాలా సేపు వేచి ఉండాల్సి వచ్చేది. ఓ సర్వే ప్రకారం గతంలో టోల్ గేట్ల వద్ద ప్రతి వాహనం దాదాపు 12 నిమిషాలు ఆగాల్సి వచ్చేది. ఫాస్ట్ ట్యాగ్ వచ్చిన తర్వాత ఒక్కో వెహికల్ సుమారు 47 సెకన్లు ఆగితే సరిపోతోంది. 
 

ఫాస్ట్ ట్యాగ్ ల్లో ఆటోమెటిక్ డెబిట్ విధానం వల్ల టోల్ ఫీ ప్రత్యేకంగా కట్టాల్సిన అవసరం లేకుండా వీలు కలిగింది. టోల్ గేట్ల దగ్గర గంటలు గంటలు వేచి ఉండాల్సిన అవసరం కూడా పోయింది. వెహికల్ పై ఉండే ఫాస్ట్ ట్యాగ్ ని స్కాన్ చేయడం ద్వారా సింపుల్ గా, వేగంగా టోల్ ఫీ వసూలు జరిగిపోతోంది. ఇప్పుడు ఇంతకు మించి వేగంగా టోల్ వసూలు చేసే విధానం రాబోతోంది. దీని పేరు గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (GNSS). 
 

Tap to resize

గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (GNSS) ఆధారంగా టోల్ వసూలు చేసే విధానాన్ని ఇండియాలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఇది టోల్ ప్లాజాల్లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. కేవలం వాహనాలు ప్రయాణించే దూరాన్ని ఆధారంగా చేసుకొని టోల్ ఛార్జ్‌ను ఆటోమేటిక్‌గా వెహికల్ ఓనర్ అకౌంట్ నుంచి డెబిట్ చేస్తుంది. 
 

GNSS ఆధారిత టోల్ వసూలు విధానం శాటిలైట్ ద్వారా పనిచేస్తుంది. అందువల్ల నేషనల్ హైవేపై మీ వెహికల్ ఎంత దూరం ప్రయాణిస్తే అంత దూరానికి మాత్రమే టోల్ కట్ అవుతుంది. ఉదాహరణకు మీరు మీ ఊరి నుంచి 10 కి.మీ. కారులో ప్రయాణించిన తర్వాత నేషనల్ హైవే ఎక్కి 5 కి.మీ. ప్రయాణించి మళ్లీ మూమూలు రోడ్డులోకి వచ్చేశారనుకోండి. GNSS ద్వారా కేవలం 5 కి.మీ. మాత్రమే టోల్ కట్ అవుతుంది. శాటిలైట్ ద్వారా మీ వెహికల్ ట్రావెల్ చేసిన దూరం, టైమ్ ను రికార్డ్ చేసి GNSS ఎంత టోల్ వసూలు చేయాలో అంతే ఫీ ఆటోమెటిక్ గా డెబిట్ చేస్తుంది.  ఇది సాధారణ రోడ్డుల్లో ప్రయాణించే వాహనాలకు వర్తించదు. నేషనల్ హైవేపై వెళితేనే టోల్ ఫీ కట్టాల్సి ఉంటుంది. 
 

GNSS ఆధారిత టోల్ వసూలు విధానాన్ని భారత ప్రభుత్వం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ద్వారా పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. ఇది ప్రధానంగా కర్నాటకలోని బెంగలూరు-మైసూర్ హైవే, హర్యానాలోని పానిపట్-హిస్సార్ హైవేలపై అమలు చేశారు. భవిష్యత్తులో ఇది ఇతర ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. GNSS వల్ల ప్రజలకు ఫ్యూయల్ ఖర్చు తగ్గుతుంది. ఎక్కడా వెహికల్ ఆగకుండా, ట్రాఫిక్ జామ్ లు లేకుండా త్వరగా గమ్యస్థానానికి చేరుకోవడానికి అవకాశం దొరుకుతుంది.

Latest Videos

click me!