లావణ్య త్రిపాఠి ఒకప్పుడు హీరోయిన్‌గా సినిమాలు చేసి మెప్పించింది. తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యింది. ఈ క్రమంలో ఆమె వరుణ్ తేజ్‌ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది వీరి వివాహం జరిగింది. అప్పట్నుంచి సినిమాలకు దూరంగా ఉంది లావణ్య త్రిపాఠి. వెండితెరపై కనిపించి ఆమె రెండేళ్లు అవుతుంది. ఈ క్రమంలో సినిమాలకు దూరం కాబోతుందనే కామెంట్స్ వచ్చాయి.
అయితే మధ్యలో ఓటీటీ ఫిల్మ్స్, వెబ్‌సిరీస్‌లో మెరిసింది. `పులిమేక`, `మిస్ పర్‌ఫెక్ట్` సిరీస్‌లో మెరిసింది. ఇక ఓటీటీకే పరిమితమనే వాదన కూడా వినిపించింది. దీనికితోడు మెగా ఫ్యామిలీ సినిమాలు చేయకూడదనే రిస్టిక్షన్ కూడా పెట్టినట్టు వార్తలు గుప్పుమన్నాయి.
ఈ క్రమంలో ఇటీవల వరుణ్ తేజ్ స్పందించాడు. ఒకప్పటిలా ఇప్పుడు లేదని, కాలం మారిందని, సినిమాలు చేయడానికి సమస్య లేదని తెలిపాడు. అన్నట్టుగానే ఇప్పుడు కొత్త సినిమాని ప్రకటించింది లావణ్య త్రిపాఠి. నేడు తన పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీని ప్రకటించడం విశేషం.
కమల్ హాసన్ మూవీ టైటిల్‌తో సినిమా చేయబోతున్నారు. `సతీ లీలావతి` పేరుతోఈ మూవీ తెరకెక్కబోతుంది. 1995లోనే కమల్.. `సతీ లీలావతి`తో సినిమా తీసి హిట్ కొట్టాడు కమల్. ఇప్పుడు లావణ్య త్రిపాఠి అదే టైటిల్‌తో మూవీ చేయడం విశేషం.
దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. తాతినేని సత్య దర్శకత్వ వహిస్తున్నారు. ఇందులో లావణ్య త్రిపాఠి ముఖ్య పాత్ర పోషిస్తుంది. లేడీ ఓరియెంటెడ్ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.