ఫహద్‌ ఫాజిల్‌ ‘బోగన్ విల్లా’ OTT మూవీ రివ్యూ

First Published | Dec 15, 2024, 3:30 PM IST

అక్టోబర్ 17వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, 35 కోట్ల వసూళ్లను రాబట్టింది. అలాంటి ఈ సినిమా,  తెలుగుతో పాటు ఇతర భాషల్లోను 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ అవుతోంది.

Amal Neerad, Bougainvillea , Ott review

భిన్నమైన కథలు, కథనాలు అంటే మలయాళం సినిమాలే.  చిన్న సింపుల్ స్టోరీని కూడా తమదైన స్క్రీన్ ప్లేతో ఇంట్రస్టింగ్ గా  చెప్పడంలో మలయాళ మేకర్స్ ను మించిన వాళ్లు లేరనేది చాలా సార్లు ప్రూవైన సత్యం. ఆ ఇండస్ట్రీ నుంచి ఇప్పటికే కొన్ని థ్రిల్లర్ మూవీస్ వచ్చాయి. మరీ ముఖ్యంగా ఓటిటిలలో ఈ సినిమాలు దేశం మొత్తం చూస్తున్నారు.

తాజాగా మరో థ్రిల్లర్ చిత్రం మళయాళం నుంచి వచ్చింది.  పుష్ప విలన్ ఫహద్‌ ఫాజిల్‌ కీలకపాత్రలో నచించిన ఈ చిత్రం ‘బోగన్ విల్లా’. జ్యోతిర్మయి, ఫహద్‌ ఫాజిల్‌( Fahadh Faasil) , కుంచకో బోబన్‌ (Kunchacko boban) కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ అక్టోబరు 17న మలయాళంలో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద రూ.35 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు తెలుగు వెర్షన్ ఓటిటిలోకి దిగింది.   ఈ సినిమా తాజాగా సోనీ లివ్ ఓటిటిలో వచ్చింది. ఈ చిత్రం కథేంటి, తెలుగువారు చూడదగిన సినిమానేనా వంటి విషయాలు చూద్దాం.

Kunchacko Boban starrer Bougainvillea

స్టోరీ లైన్

డాక్టర్ రాయిస్ (కుంచాకో బోబ‌న్‌)  తన భార్య రీతూ (జ్యోతిర్మ‌యి) తో కలిసి ఉంటాడు. ఆమె ఓ  యాక్సిడెంట్‌లో  అమ్నేసియా బారిన ప‌డి జ్ఞాప‌క‌శ‌క్తిని కోల్పోతుంది. దాంతో ఈ రోజు జరిగినవి తెల్లారే సరికి మర్చిపోతుంది. ఈ క్రమంలో రీతూ జీవితంలో ప్ర‌తిరోజు కొత్త‌ే, అయితే స్కూల్ కు వెళ్లే త‌న ఇద్ద‌రు పిల్ల‌ల సంర‌క్ష‌ణ‌ను చూస్తూ ఆ బాధ‌ను మ‌ర్చిపోయే ప్ర‌య‌త్నం చేస్తుంటుంది రీతూ. ఆమె తలరా స్నానం చేస్తే అంతకు ముందు రోజు జరిగినవి గుర్తు ఉండవు. ఎంత గుర్తు చేసుకుందామని ప్రయత్నించినా ఆమె వల్ల కాదు. దాంతో ఆమె తన చుట్టూ జరిగే సంఘటనలను ఎప్పటికప్పుడు కొన్ని కాగితాలపై రాసుకుని చదువుకుంటూ ఉంటుంది.  కేరళలోని  ఓ హిల్ స్టేష‌న్‌లోని హాస్పిట‌ల్‌లో ప‌నిచేస్తూ భార్య‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటుంటాడు రాయిస్‌.
 

Tap to resize

Kunchacko Boban starrer Bougainvilleas


రీతూ  పెయింటింగ్స్ వేస్తూ కాలక్షేపం చేస్తూంటుంది. ఆ పెయింటిగ్స్ లో ఎప్పుడూ బోగన్ విల్లాలు, ఎర్రటి రక్తం లాంటి విజువల్స్ కనపడుతూండటం ఆశ్చర్యపరుస్తూంటాయి. ఆ పెయింటింగ్స్ ఎప్పటికప్పుడు అమ్ముడైపోతూంటాయి. ఎవరు అంత ఆసక్తిగా ఆ పెయింటింగ్స్ కొంటున్నారో అర్దం కాదు.  అలా గడుస్తున్న సమయంలో వాళ్ల జీవితాల్లోకి మరో పాత్ర ఎంట్రీ ఇస్తుంది. అతనే ఏసీపీ డేవిడ్ ఖోషి(ఫహాద్ ఫాజిల్). కేరళలో టూరిస్టుల సీరియల్ మిస్సింగ్ కేసులు సంచలనంగా మారటంతో వాటి ఇన్విస్టిగేషన్ చేస్తూంటాడు. ముఖ్యంగా ఆ హిల్ స్టేష‌న్‌లోని ఓ కాలేజీలో చ‌దువుతున్న మినిస్ట‌ర్ కూతురు క‌నిపించ‌కుండాపోతుంది. మినిస్ట‌ర్ కూతురు మిస్సింగ్‌కు రీతూకు సంబంధం ఉంద‌ని ఏసీపీ డేవిడ్ కోషి (ఫ‌హాద్ ఫాజిల్‌) అనుమానించటంతో కథ మలుపు తిరుగుతుంది. 

ఈ కేసులకు రీతూకూ సంబంధం ఉందనేది ఏసీపీ డేవిడ్‌  డౌట్. దాంతో ఆమెను అనుమానించి, వెంబడిస్తాడు. పోలీస్ స్టేషన్ కు  పిలుస్తాడు. అతను అనుమానించినట్లుగానే టూరిస్టుల మిస్సింగ్‌కు రీతూనే కారణం అన్నట్లు డేవిడ్‌కు కొన్ని ఆధారాలు దొరుకుతాయి. అయితే రీతూ నుంచి నిజాలు చెప్పించటానికి చాలా కష్టమవుతుంది. ఆమె ఆమ్నీషియా ఇన్విస్టిగేషన్ కు అడ్డంగా నిలుస్తుంది.  అయితే క్రిమినాల‌జిస్ట్ మీరాతో క‌లిసి డేవిడ్ కోషి సాగించిన అన్వేష‌ణ‌లో రీతూ గురించి షాకింగ్ విష‌యాలు బ‌య‌ట‌ప‌డ‌తాయి.అయితే చివరకు ఆ ముడి విప్పగలుగుతారు. ఇంతకీ  ఆ మిస్సింగ్స్‌ కి రీతూకి ఉన్న సంబంధం ఏంటి? ఏసీసీ డేవిడ్‌ కి దొరికిన క్లూలు ఏమిటి, వాటికి ఆమె గీసే పెయింటింగ్స్ కు సంభందం ఉందా? అన్నది చిత్ర కథ.  

Bougainvillea 2024

విశ్లేషణ

నవలా ఆధారిత చిత్రాలు అన్ని భాషల్లోనే ఈ మధ్యన బాగా తగ్గాయి. అందుకు కారణం సక్సెస్ ఫుల్ నవలలు రాసే వాళ్లు అరుదైపోవటమే. అయితే తాజాగా  లాజో జోస్ రచించిన  మలయాళ థ్రిల్లర్ నవల ‘రుథింథె లోకమ్’ (Ruthinte Lokam) బాగా పాపులర్ అయ్యింది. దాంతో ఆ నవల రైట్స్ కొని  ఈ సినిమా తెరకెక్కించారు. నవలకు తగ్గ స్దాయిలో సినిమా లేదని కామెంట్స్ వచ్చినా, సినిమాగా మంచి ఇంటెన్స్ థ్రిల్లర్ అనే  పేరు తెచ్చుకుంది. 

డైరక్టర్, కో రైటర్ అయిన అమల్ నీరద్ ఈ సినిమాని ఓ మిస్టరీ థ్రిల్లర్ గా తీర్చిదిద్దాలనే ఆలోచనతో చేసారు. అది మనకు మొదటి షాట్ నుంచి అర్దమవుతూనే ఉంటుంది. మెల్లిగా మనకు పాత్రలను పరిచయం చేస్తూ  కథనం కదులుతుంది. అయితే ఆ క్రమంలో ఇంత స్లో సినిమా ఏంట్రా బాబు అనిపిస్తుంది. జరిగిందే జరిగినట్లు అనిపిస్తుంది. ఇందులో ప్రధాన పాత్ర లాగ మనకు ఆమ్నీషియా లేదు కదా..ఎందుకు ఇలా రిపీట్ చేస్తున్నారు అనిపిస్తుంది. అయితే ఎప్పుడైతే ఈ మిస్టరీ థ్రిల్లర్  కాస్తా ఇన్విస్టిగేటివ్ థ్రిల్లర్ గా టర్న్ తీసుకుంటుందో అప్పటి నుంచి కథ పరుగులు పెడుతుంది. అయితే సినిమా చివరకు వచ్చేసరికి ప్రెడిక్టబులిటీగా అనిపిస్తుంది. దాంతో ఎంత బాగా మిస్టరీని బిల్డ్ చేసినా ఒక్కసారిగా అదంతా కూలిపోయిన ఫీలింగ్ వస్తుంది. 

Amal Neerads film Bougainvillea

ఎవరెలా చేసారు

టెక్నికల్ గా ఈ సినిమా చాలా మంచి స్టాండర్డ్స్ లో ఉంది. కెమెరా వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే నెక్ట్స్ లెవిల్ లో ఉంది.  అమల్ సినిమాటోగ్రఫర్ నుంచి దర్శకునిగా మారి చేసిన సినిమా కావటంతో ఆ స్టైల్ కనపడుతుంది. గతంలో  అమల్... దుల్కర్ సల్మాన్ తో ‘సి.ఐ.ఎ’, మమ్ముట్టితో ‘బిగ్ బి’, ‘భీష్మ పర్వమ్’ లాంటి థ్రిల్లర్ సినిమాలు తీసి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా అయితే మరీ అద్బుతం అనిపించదు. అయితే మొదటి నుంచి చివరి దాకా అయితే తర్వాత ఏం జరుగుతుంది అనే ఆసక్తి కలగచేసారు.క్లైమాక్స్ తేలిపోయింది. డైరెక్టర్‌ క్వెంటిన్‌ టరంటినో చిత్రం డెత్ ఫ్రూఫ్ గుర్తుకు వస్తుంది.  అయితే ఎండ్ ట్విస్ట్ ఆశ్చర్యపరుస్తుంది. 
 

Bougainvillea

నటీనటుల విషయానికి వస్తే....

 పుష్ప తో తెలుగులోనూ  బాగా పాపులర్ అయిన ఫహద్‌ ఫాజిల్‌ ని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఈ సినిమా నిరాశ వస్తుంది. ఇందులో ఫహద్  ఓ స్టయిలిష్ పోలీసాఫీసర్ రోల్ మాత్రమే ఇచ్చారు దర్శకుడు అమల్ నీరద్. అంతకు మించి ఏమీ లేదు. ‘నాయట్టు’, ‘2018’, చిత్రాల ఫేమ్ కుంచాకో బోబన్(Kunchacko Boban), జ్యోతిర్మయి ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. వారిద్దరూ పోటీపడి చేసారు. ముఖ్యంగా జ్యోతిర్మయి సినిమాకు ప్రాణం పోసింది. 

Bougainvillea

ఫైనల్ థాట్

స్లోగా ఉండే సీన్స్ మనవాళ్లను కాస్తంత ఇబ్బంది పెట్టినా  సైక్లాజికల్ థ్రిల్లర్స్ చూసే ఇంట్రస్ట్ ఉన్నవారికి మంచి ఆప్షన్. చివరిదాకా ఎంగేజ్ చేస్తుంది. అలాగే కొంత హింస ఉండటంతో ప్యామిలీతో చూసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. 

ఎక్కడ చూడచ్చు


మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా సోనీలివ్ లో డిసెంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో ఉంది కాబట్టి హ్యాపీగా చూసేయచ్చు.

Latest Videos

click me!