Jul 21, 2023, 9:25 PM IST
ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య పెరుగుతోందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ వ్యాధి వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి. ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయలేనప్పుడు లేదా శరీరం ఉత్పత్తి చేసిన ఇన్సులిన్ ను సమర్థవంతంగా ఉపయోగించనప్పుడు డయాబెటీస్ వస్తుంది. అయితే దీర్ఘకాలం పాటు మీ రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే సెక్స్ కు సంబంధించిన సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీనినే లైంగికంగా పనిచేయకపోవడం అంటారు.