Mar 16, 2022, 10:59 AM IST
రష్యా దురాక్రమణ తో ఉక్రెయిన్ సర్వనాశనం అయింది. దాదాపు ఉక్రెయిన్ లో అన్నీ పట్టణాలు, నగరాలు ధ్వంసం అయ్యాయి..జనావాసాలపై కూడా రష్యా దాడులు జరుపుతుండటం తో స్థానికులకు నిలువ నీడ లేకుండా పోతుంది. ప్రాణాలతో ఉంటే చాలు అని స్వదేశం వదిలి పారిపోతున్నారు. రేపు ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితుల్లో పోలాండ్ వంటి దేశాలకు వలస పోతున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఐరోపా లో తలెత్తిన అతి పెద్ద శరణార్ధుల సంక్షోభం ఇదే. దాదాపు 18 లక్షల మంది పోలాండ్ కు తరలి వెళ్లారని ఒక అంచనా. తన ఇద్దరి పిల్లల ప్రాణాలు కాపాడుకోవడానికి స్వదేశం వదిలి పోలాండ్ సరిహద్దుకు చేరిన ఒక ఉక్రెయిన్
మహిళతో స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు కళ్ళకు కట్టినట్టు మీకందిస్తున్న మా ఏసియా నెట్ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ రఘువంశం మాట్లాడటం జరిగింది..ఆ వీడియో ఎక్స్ క్లూసివ్ గా మీకోసం...