Nov 30, 2019, 8:15 PM IST
అమరావతి: హైదరాబాద్ శివారులోని శంషాబాద్ ప్రాంతంలో ప్రియాంక రెడ్డి అనే యువతి కామాంధుల చేతిలో అత్యంత దారుణంగా అత్యాచారం, హత్యకు గురయిన సంఘటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో ఈ దారుణానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. అలాగే యువతి మృతికి సంతాపంగా ప్రజలందరు సంతాపం ప్రకటిస్తున్నారు. ఇలా గుంటూరు జిల్లా తుళ్లూరులో కూడా ప్రియాంక మృతికి సంతాపంగా స్థానిక యువత, చిన్నారులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు పశు వైద్యాధికారులు కూడా పాల్గొన్నారు.