సోషల్ మీడియాలో తమపై అసభ్యకరమైన పోస్టింగ్ లు పెడుతున్నారని ఆరోపిస్తూ కొందరు తుళ్లూరు మహిళలు పోలీసులను ఆశ్రయించారు.
రాజధాని కోసం ఉద్యమబాట పట్టిన అమరావతి ప్రాంతానికి చెందిన మహిళలమైన తమపై కొందరు సోషల్ మీడియాతో అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారని ఆరోనిస్తూ తుళ్లూరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపై అసభ్యంగా పోస్టింగులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని మహిళలు ఫిర్యాదులో పేర్కొన్నారు. రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి మరీ నీచంగా పోస్టింగ్ లు పెట్టినట్లు మహిళలు పోలీసులకు వివరించారు.