Dec 3, 2019, 12:32 PM IST
విక్టరీ వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 13న విక్టరీ వెంకటేశ్, యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య మల్టీస్టారర్ `వెంకీమామ` విడుదలవుతుంది. ఇంతకుముందే అక్కినేని నాగచైతన్య, రాశీఖన్నా పుట్టినరోజుల సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి వారి టీజర్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేస్తూ హీరో రానా దగ్గుబాటి, డైరెక్టర్ బాబీ ఓ ఫన్నీ వీడియో కూడా విడుదల చేశారు. అదేంటో ఓ లుక్కేయండి...