Spiritual

చాణక్యనీతి: గౌరవం కోల్పోకుండా క్షమాపణలు చెప్పేదెలా?

గౌరవంగా క్షమాపణ చెప్పండి

చాణక్య ప్రకారం, నిజమైన శక్తి వినయంలో ఉంది. మీరు తప్పును అంగీకరించి క్షమాపణ చెప్పినప్పుడు, అది మీ గౌరవాన్ని దెబ్బతీయదు. మీరు మనస్ఫూర్తిగా, గౌరవంగా క్షమాపణ చెబితే చాలు.

 

మీరు తప్పు చేయనప్పుడు క్షమాపణ చెప్పకండి

క్షమాపణ చెప్పే ప్రక్రియ తెలివిగా ఉండాలని చాణక్య  బోధించారు. మీరు తప్పు చేయనప్పుడు క్షమాపణ చెప్పడం వల్ల మీ గౌరవానికి భంగం కలుగుతుంది. 

క్షమాపణ చెబుతున్నప్పుడు ఆత్మగౌరవాన్ని కాపాడుకోండి

క్షమాపణ చెబుతున్నప్పుడు ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని చాణక్యుడు చెబుతున్నారు. క్షమాపణ చెప్పడం అంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం కాదు,  సరైన మార్గంలో సంబంధాన్ని మెరుగుపరచడం

క్షమాపణ చెప్పడానికి సరైన సమయం ఎంచుకోండి

చాణక్య సమయానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. మీరు కోపం లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు క్షమాపణ చెబితే, ఆ క్షమాపణ నిజాయితీగా అనిపించకపోవచ్చు. ఇద్దరూ ప్రశాంతంగా ఉన్నప్పుడు క్షమాపణ చెప్పాలి.

ఇతరుల భావాలను అర్థం చేసుకుని క్షమాపణ చెప్పండి

 ఎవరికైనా క్షమాపణ చెప్పే ముందు వారి భావాలను , బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. 

వెంటనే క్షమాపణను ఆశించకండి

మీరు చెప్పిన క్షమాపణను వారు వెంటనే స్వీకరిస్తారని అనుకోకూడదు. క్షమాపణ ఉద్దేశ్యం కేవలం గొడవను పరిష్కరించడం కాదు, కొత్త సంభాషణను ప్రారంభించడం. కాబట్టి ఓపికగా ఉండండి.

చాణక్య నీతి: భార్య లో భర్త కోరుకునే గుణాలు ఇవే

చాణక్య నీతి: ఈ 3 పనులు మీ గౌరవాన్ని దెబ్బతీస్తాయి

చాణక్య నీతి: ఈ ఒక్క అలవాటు మీ విజయాన్ని దూరం చేస్తుంది

ఇంటి మెయిన్ డోర్ పై ఓమ్ రాస్తే ఏమౌతుంది?