టాలీవుడ్ ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ, నవీన్ పోలిశెట్టి, కిరణ్ అబ్బవరం లాంటి యువ హీరోలు సత్తా చాటుతున్నారు. టైర్ 2 పొజిషన్ లో ఉన్న విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్, శర్వానంద్ లాంటి హీరోలు మాత్రం తడబడుతున్నారు. 2024 సంవత్సరం కొందరు కుర్ర హీరోలకు ఏమాత్రం కలసి రాలేదు. 2024లో నితిన్ లాంటి హీరోల నుంచి సినిమాలు రాలేదు. కొందరు రిలీజ్ చేసినప్పటికీ ఫ్లాప్ లు మూటగట్టుకున్నారు. ఆ జాబితా ఇప్పుడు చూద్దాం.
నితిన్ :
నితిన్ నుంచి గత ఏడాది విడుదలైన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. అంతకు ముందు వచ్చిన మాచర్ల నియోజకవర్గం కూడా ఫ్లాప్ చిత్రమే. భీష్మ తర్వాత నితిన్ కి సరైన హిట్ లేదు. దీనితో నితిన్ కెరీర్ కాస్త ట్రాక్ తప్పింది. తిరిగి నితిన్ కోలుకోవాలంటే అర్జంటుగా హిట్ అవసరం. ఈ ఏడాదికి లాస్ట్ పంచ్ అవుతుంది అనుకున్న రాబిన్ హుడ్ చిత్ర విడుదల సందిగ్ధంలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా నితిన్ కి గత ఏడాది తో పాటు 2024 కూడా కలసి రాలేదు.
విజయ్ దేవరకొండ :
రౌడీ హీరో విజయ్ దేవరకొండకి తన కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఈ ఏడాది ఎదురైంది. ఫ్యామిలీ స్టార్ చిత్రం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. కల్కి చిత్రంలో కొన్ని నిమిషాల పాటు అర్జునుడి పాత్రలో కనిపించడం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి ఊరట. ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ కి కూడా గీత గోవిందం తర్వాత ఆ రేంజ్ హిట్ పడలేదు.
రామ్ పోతినేని :
రామ్ పోతినేని కూడా గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేదు. క్లారిటీగా చెప్పాలంటే ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ నటించిన చిత్రాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఈ ఏడాది రామ్ నుంచి వచ్చిన డబుల్ ఇస్మార్ట్ కూడా దెబ్బేసింది. ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం నిరాశ పరిచింది. దీనితో రామ్ కి కూడా 2024 లో బ్యాడ్ ఇయర్ గానే మిగిలింది. వచ్చే ఏడాది రామ్ తప్పనిసరిగా హిట్ కొట్టి తీరాలి.
వరుణ్ తేజ్ :
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి ప్రస్తుతం బ్యాడ్ ఫేజ్ కొనసాగుతోంది. 2024 ఏడాది వరుణ్ తేజ్ కి కెరీర్ పరంగా ఒక పీడకల అని చెప్పొచ్చు. ఈ ఏడాది వరుణ్ తేజ్ నుంచి 2 చిత్రాలు వచ్చాయి. ఒకటి ఆపరేషన్ వాలంటైన్ కాగా.. మరొకటి రీసెంట్ గా వచ్చిన మట్కా. రెండు చిత్రాలు దారుణంగా నిరాశపరిచాయి. మరి ఈ పరిస్థితి నుంచి వరుణ్ తేజ్ తిరిగి తన కెరీర్ ని ఎలా గాడిలో పెట్టుకుంటాడు అనేది కీలకం.
శర్వానంద్ :
టాలీవుడ్ లో రిచెస్ట్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. అందుకే శర్వానంద్ ని కుబేరుడు అని అంటుంటారు. టాలీవుడ్ ఫ్యామిలీ ఆడియన్స్ లో క్రేజ్ తెచ్చుకున్న హీరో శర్వానంద్. శర్వానంద్ నుంచి ఈ ఏడాది మనమే చిత్రం వచ్చింది. ఆ మూవీ శర్వానంద్ కి బిగ్ షాక్. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం శర్వానంద్ లైనప్ లో రెండు చిత్రాలు ఉన్నాయి.