కీర్తి సురేష్ మెడలో మూడుముళ్లు వేసిన ఆంటోనీ, వైరల్ అవుతున్న మహానటి పెళ్ళి ఫోటోలు.

First Published | Dec 12, 2024, 3:20 PM IST

ఎట్టకేలకు బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పింది హీరోయిన్ కీర్తి సురేష్. తన మిత్రుడు ఆంటోనీతో మూడు ముళ్లు వేయించుకుని పెళ్ళిబంధంలోకి అడుగు పెట్టింది. 

కొద్ది రోజులుగా అభిమానులు ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. మూడుముళ్ల బంధంతో తన ప్రియుడిని పెళ్ళాడింది హీరోయిన్ కీర్తి సురేష్. తన చిన్నాటి మిత్రుడు ఆంటోనీ తట్టిళ్ కీర్తి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు డిసెంబర్ 12 గురువారం గోవాలో హిందూ సాంప్రదాయ పద్దతిలో వీరి పెళ్ళి జరిగింది. ఈ పెళ్ళికి బంధువులు, స్నేహితులతో పాటు.. అతి కొద్ది మంది సినీ ప్రముఖులు పాల్గొన్నట్టు సమాచారం. 

keerthy suresh

స్కూల్ డేస్ నుంచి కలిసి చదువుకున్నారు కీర్తి సురేష్ - ఆంటోనీ. అయితే అది కాస్త కాలేజీ డేస్ కు వచ్చే సరికి ప్రేమగా మారింది. అప్పటి నుంచి ప్రేమలో ఉన్నా.. ఏనాడు ఎవరికి అనుమానం రానివ్వలేదు కీర్తి. ఎక్కడా తన ప్రియుడి గురించి మాట్లాడలేదు. కెమెరా కళ్లకి కూడా చిక్కలేదు. అయితే పెళ్ళి చేసుకోబోయే టైమ్ లో మాత్రం అసలు విషయం అనౌన్స్ చేసింది కీర్తి సురేష్. సోషల్ మీడియా వేదికగా తన ప్రియుడిని పరిచయం చేసింది. 

Tap to resize

తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఇతనే అని డిటేయిల్స్ వెల్లడించింది. ప్రియుడి విషయాలు రహస్యంగా ఉంచిన కీర్తి సురేష్.. తన మీద వచ్చిన రూమర్స్ పై కూడా స్పందించలేదు. గతంలో కీర్తి సురేష్ పై చాలా కామెంట్లు వినిపించాయి. పెద్దలు పెళ్ళి చేయబోతున్నారని.. క్రికెటర్ ను ప్రేమిస్తుందని, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో ఎఫైర్ ఉందని. ఇలా రకరకాల వార్తలు వినిపించాయి. 

కాని వేటిపై ఆమె స్పందించలేదు. ఇక తాను పెళ్ళి చేసకోవాలి అనుకున్నప్పుడు మాత్రం తనకు కాబోయే భర్త ఆంటోనీ అంటూ ప్రకటించింది. ఇంతకీ ఎవరు ఈ ఆంటోనీ తట్టిళ్.. ఏం చేస్తుంటాడు. బ్యాక్ గ్రౌండ్ ఏంటీ..? వివరాల్లోకి వెళ్తే.. ఆంటోనీ కీర్తికి చిన్ననాటి మిత్రుడు. స్నేహం కాస్త ప్రేమగా మారింది. అయితే ఇంజనీరింగ్ పూర్తి చేసనిఇతను దూబాయ్ లో ఉద్యోగం చేశాట. 

ఆతరువాత సొంతంగా బిజినెస్ లు కూడా చేశాడట ఫారెన్ లో. ఇక ప్రస్తుతం ఇండియాలో కేరళలో కొన్ని కంపెనీలు రన్ చేస్తున్నాడని సమాచారం. ఫైమస్ బ్రాండ్ కంపెనీ అతనుకు ఉందట. ఇక ఆంటోనీ ఆస్తుల విలువ 400 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా. ఫిట్ గా హీరోలా ఉన్న ఆంటోనీ.. కీర్తి సురేష్ పెళ్ళి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 

Latest Videos

click me!