Pradeep Machiraju: ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి". నితిన్, భరత్ దర్శకత్వం వహించారు. వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్, GM సుందర్, జాన్ విజయ్, రోహిణి, ఝాన్సీ, తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రాధన్ సంగీతం సమకూర్చారు. ఏప్రిల్ 11న ఈ మూవీ థియేటర్లలో విడుదల అయింది. ప్రేక్షకుల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు.