అనసూయ, రష్మిలా బిహేవ్ చేయాల్సిన అవసరం నాకు లేదు.. గ్లామర్ చూపించకుండానే ఛాన్సులు వస్తాయి
అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పిన తర్వాత ఆ అవకాశం కన్నడ బ్యూటీ సౌమ్య రావుకి దక్కింది. కొంతకాలం సౌమ్య రావు జబర్దస్త్ షోలో మెరిసింది.
అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పిన తర్వాత ఆ అవకాశం కన్నడ బ్యూటీ సౌమ్య రావుకి దక్కింది. కొంతకాలం సౌమ్య రావు జబర్దస్త్ షోలో మెరిసింది.
అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పిన తర్వాత ఆ అవకాశం కన్నడ బ్యూటీ సౌమ్య రావుకి దక్కింది. కొంతకాలం సౌమ్య రావు జబర్దస్త్ షోలో మెరిసింది. అనసూయ రేంజ్ లో కాకున్నా సౌమ్య రావు కూడా గ్లామర్ తో ఆకట్టుకుంది. జబర్దస్త్ తర్వాత సౌమ్యరావు మరికొన్ని షోలలో కూడా కనిపించింది.
ఓ ఇంటర్వ్యూలో అనసూయ, రష్మీ గురించి సౌమ్యరావు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. బుల్లితెరపై గ్లామర్ ప్రదర్శించాలి అంటే అనసూయ తర్వాతే ఎవరైనా అనే ప్రచారం టాలీవుడ్ లో ఉంది. అంతలా అనసూయ గ్లామర్ ప్రదర్శిస్తూ యాంకర్ గా గుర్తింపు సొంతం చేసుకుంది.
రష్మీ గౌతమ్ కూడా గ్లామర్ తో గుర్తింపు పొందింది. ఓ ఇంటర్వ్యూలో అనసూయ, రష్మీ రేంజ్ లో మీరు గ్లామర్ షోపై డిపెండ్ కావడం లేదు. వెనుకబడిపోతారు అనే భయం లేదా అని యాంకర్ అడిగారు. వాళ్ళలా గ్లామర్ ప్రదర్శించాల్సిన అవసరం నాకు లేదు. గ్లామర్ ప్రదర్శించకపోయినా నాకు వచ్చే అవకాశాలు వస్తూనే ఉంటాయి. వాళ్ళతో నాకు సంబంధం లేదు అని సౌమ్య రావు తెలిపారు.
నేను జబర్దస్త్ కి వచ్చే సమయంలో అసలు అనసూయ ఎవరో కూడా తనకి తెలియదు అని సౌమ్యరావు పేర్కొంది. ఆ తర్వాత మాత్రం ఒకటి రెండు సార్లు మీట్ అయ్యానని సౌమ్య తెలిపారు.