మంచు ఫ్యామిలీలో గత కొంత కాలంగా వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. గత రెండు మూడు నెలలుగా మంచు మోహన్‌బాబు, మంచు విష్ణులకు, మంచు మనోజ్‌కి మధ్య గొడవలు అవుతున్నాయి. ఆస్తుల విషయంలోనే ఈ గొడవలు అని బయటకు తెలుస్తుంది. కానీ కాలేజీ, యూనివర్సిటీ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని మంచు మనోజ్ ఆరోపిస్తున్నారు. కానీ మనోజ్ ఇలా చేయడం సరికాదని, తాగి ఇంటికి వచ్చి గొడవలు పెట్టుకుంటున్నాడని మోహన్ బాబు అంటున్నాడు. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కొట్టుకునే స్థాయికి వెళ్లారు.
మంచు ఫ్యామిలీ గొడవల విషయంలో మంచు లక్ష్మి న్యూట్రల్‌గా ఉంది. ఎవరివైపు సపోర్ట్ చేయాలో అర్థం కాని పరిస్థితి ఆమెది. చాలా వరకు మంచు లక్ష్మి మంచు మనోజ్‌కే ఫేవర్‌గా ఉంటుంది. ఆయన్నే గారాభంగా చూసుకుంటుంది.
అంతేకాదు మౌనికా రెడ్డితో పెళ్లి చేసింది కూడా తనే. భూమా మౌనికా రెడ్డిని మనోజ్ పెళ్లి చేసుకోవడం మోహన్ బాబు, విష్ణులకు ఇష్టం లేదు. దీంతో లక్ష్మీనే దగ్గరుండి మ్యారేజ్ చేసింది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు మంచు లక్ష్మి, మనోజ్‌లకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవతుంది. ఇందులో మనోజ్‌ని పట్టుకుని మంచు లక్ష్మి కన్నీళ్లు పెట్టుకోవడం షాకిస్తుంది. మంచు లక్ష్మి శనివారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఫ్యాషన్ వీక్‌లో పాల్గొంది. ఈ ఈవెంట్‌లో ఆమె స్టేజ్‌పై నిల్చొని ఉండగా, వెనకాల నుంచి మంచు మనోజ్ వచ్చాడు.
లక్ష్మిని పట్టుకోగా, ఆమె కింద కూర్చొని మనోజ్‌ని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది. తమ్ముడిని చూసి బోరున విలపించింది. దీంతో పక్కనే ఉన్న మౌనికా కూడా వచ్చి లక్ష్మిని ఓదార్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందరిని కదిలిస్తుంది.
got emotional 🥹 as soon as she saw her brother at an event yesterday 🖤 pic.twitter.com/7jgGGqKxTQ
— Movies4u Official (@Movies4u_Officl)ఇదిలా ఉంటే ఇటీవల మంచు విష్ణుపై మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కారుని దొంగిలించారని, వస్తువులను దొంగిలించారని ఆరోపించిన విషయం తెలిసిందే. అంతేకాదు ఇంట్లోకి రానివ్వడం లేదని ఆరోపిస్తూ జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంటిముందు నిరసన వ్యక్తం చేశాడు.
మంచు విష్ణునే దొంగ అని, ఆయన కన్నప్ప కాదు, దొంగప్ప అంటూ ఆయన ఆరోపించారు. ఆ సందర్భంగా మనోజ్ నిరసన వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మంచు లక్ష్మి, మనోజ్‌ల మధ్య ఎమోషనల్ వీడియో మరింత హల్‌చల్ చేస్తుంది. ఇది ఎమోషనల్‌గానూ ఆకట్టుకుంటుంది.