Fish: చేపలతోపాటు వీటిని అస్సలు తినకూడదు తెలుసా?

Published : Apr 13, 2025, 02:11 PM IST

ఆరోగ్యంగా ఉండటానికి మంచి ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని ఎలా తీసుకుంటున్నాం అనేది కూడా అంతే ముఖ్యం. చేపలు ఆరోగ్యానికి ఎంతమంచివో అందరికీ తెలుసు. చేపలను చాలామంది ఇష్టంగా తింటారు. చేపల పులుసు, ప్రై, పచ్చడి ఇలా రకరకాలుగా మనం వీటిని వండుకొని తింటుంటాం. కానీ చేపలను తిన్న తర్వాతా కొన్ని పదార్థాల జోలికి అస్సలు వెళ్లకూడదట.  అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
14
Fish: చేపలతోపాటు వీటిని అస్సలు తినకూడదు తెలుసా?

చేపలు ఆరోగ్యానికి చాలామంచివి. డాక్టర్లు కూడా వీటిని బాగా తినాలని చెబుతుంటారు. అయితే చేపలు తిన్నాక కొన్ని పదార్థాలను అస్సలు తినకూడదట. ఎందుకు తినకూడదు? తింటే ఏమవుతుందో.. ఇక్కడ తెలుసుకుందాం.

నిపుణుల ప్రకారం చేపలతో.. పాలు, పాల ఉత్పత్తులను అస్సలు తినకూడదట. విడిగా రెండు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ కలిపి తినడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం.

24
ఆరోగ్యానికి హానికరం!

పాలు, చేపలు కలిపి తినడం ఆరోగ్యానికి చాలా ప్రమాదమంటున్నారు నిపుణులు. కొందరు చేపలు తిన్న తర్వాత పాలు తాగుతారు. ఇలా చేస్తే చర్మ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. 

 

34
చేపలు, పెరుగు

కొందరు చేపలు, పెరుగు కలిపి తింటారు. ఇలా చేయడం వల్ల చాలా సమస్యలు వస్తాయట. ఆయుర్వేదం ప్రకారం చేప వేడి చేస్తుంది, పాలు, పెరుగు చల్లగా ఉంటాయి. వేడి, చల్లని పదార్థాలు కలిపి తినకూడదు. చేపలు, పాలు, పెరుగు కలిపి తింటే జీర్ణ సమస్యలు, అలర్జీలు, చర్మ వ్యాధులు వస్తాయట.
 

44
జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి..

చేపలు, పాలు రెండూ హెవీ ఫుడ్సే. వీటిని కలిపి తినడం వల్ల జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల అజీర్ణం, ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. పెరుగు చల్లగా ఉంటుంది. ఇది చేపలతో తిన్నప్పుడు జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల చర్మంపై దురద, బొబ్బలు, మచ్చలు లేదా తామర వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories