Dec 4, 2019, 1:35 PM IST
హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచార ఘటనపై యావత్తు భారతావని ఆవేదన వ్యక్తం చేస్తోంది. మృగాళ్లు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, తర్వాత ఆమెను హత్య చేశారు. ఈ ఘటనపై మా అసోసియేషన్ తమ సంతాపాన్ని వ్యక్తం చేసింది. దిశ కుటుంబాన్ని కలిసి తమ మద్ధతు తెలియజేసింది. ఈ సందర్బంగా జీవిత మాట్లాడుతూ ఊర్లోకి పులో, సింహమో వస్తే కొట్టి చంపినట్టే వీళ్లనూ చంపాలన్నారు. దిశ చెల్లెలు మనసులో బ్లాంక్ అయ్యిందని...నా వల్లే ఇలా అయిందా అని ఫీలవుతుందని నటి హేమ ఆవేదన వ్యక్తం చేసింది.