మరే గాయకుడికీ అందనంత ఎత్తులో బాలు రికార్డులు..

Sep 25, 2020, 6:43 PM IST

పాటే శ్వాసగా, పాటే శాసనంగా, పాటే జీవనంగా సాగిన గాన గందర్వుడి జీవితం అర్థాంతరంగా ముగిసింది. కోట్లాది మంది అభిమానులను శోకసముద్రంలో ముంచేసి బాలు వెళ్లిపోయారు. బాలు ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం.. నడుమ ఈ నాటకం విధి లీలా.. అంటూ తను పాడిన పాట ఇప్పుడు అందరి హృదయాల్నీ కదిలిస్తోంది.