జేబులు కొట్టేస్తూ దొరికిన సీనియర్ నటి, అరెస్ట్ చేసిన పోలీసులు

Mar 14, 2022, 1:23 PM IST

బెంగాల్ కి చెందిన నటి రూప దత్తను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను దొంగతనం ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే కలకత్తా నగరంలోని బిధాన్ నగర్ పోలీస్ స్టేషన్ కి చెందిన పోలీసులు ఓ మహిళ తన హ్యాండ్ బ్యాగ్ చెత్త కుండీలో వేయడం గమనించారు. అనుమానంతో ఆ మహిళను పోలీసులు ప్రశ్నించారు. అలాగే ఆమె బ్యాగ్ ఓపెన్ చేయగా కొన్ని మనీ పర్సులు ఉన్నట్లు గమనించారు.