టాస్క్ కోసం తెగించిన కంటెస్టెంట్స్.. ఆరు బయటే కానిచ్చేశారు..

Sep 23, 2020, 2:06 PM IST

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లో16వ రోజు కావాల్సినంత మసాలాతో ఫుల్ జోష్ లో సాగింది. మోనాల్‌‌ను టీజ్ చేస్తూ లవ్ ప్రపోజల్ చేశాడు ముక్కు అవినాష్ ఆటపట్టించాడు. మోనల్ తో హలో గురు ప్రేమ కోసమే అంటూ మళ్లీ ఫ్లర్ట్ చేసే ప్రయత్నం చేశాడు అవినాష్. వంటింట్లో ఉన్న సుజాత రెండు జెడలతో ఉన్న సుజాతను చూస్తూ మోనల్, అవినాష్ 70లో ఉండే హీరోయిన్‌‌లా ఉందంటూ కామెంట్ చేశారు. నీవు అలనాటి హీరోయిన్ వాణిశ్రీలా ఉన్నావు.. నిన్ను అలాగే చూడాలనిపిస్తాయని అవినాష్ అంటే.. అలా చూడకు గుడ్లు గుంజుతాయ్.. అలానే చేస్తే గుడ్లు పీకి గోళీలు ఆడుతాను అంటూ సుజాత స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.