పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ హైలైట్స్: అనూహ్య మలుపులు, అద్వితీయ ఇన్నింగ్స్ లు

Sep 21, 2020, 1:28 AM IST

IPL 13వ సీజన్‌లో రెండో మ్యాచ్ కూడా క్రికెట్ ప్రేక్షకులకు కావాల్సినంత మజాను అందించింది. అంచనాలను తలకిందులు చేస్తూ, ఆధిక్యం చేతులు మారుతూ వచ్చిన మ్యాచ్‌ సూపర్ ఓవర్‌కి వెళ్లింది. సూపర్ ఓవర్‌లో పంజాబ్ కేవలం 2 పరుగులే చేసి రెండు వికెట్లు కోల్పోవడంతో ఢిల్లీ 3 పరుగుల టార్గెట్‌ను సులువుగా చేధించింది.