చెన్నై ఖేల్ ఖతం: ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ప్లే ఆఫ్స్ ఆడకుండా ఇంటికి

Oct 20, 2020, 12:22 AM IST

IPL 2020: ఐపీఎల్ చరిత్రలోనే ఆడిన ప్రతీ సీజన్‌లోనూ ప్లేఆఫ్ చేరిన ఏకైక జట్టుకు చుక్కలు చూపించింది 2020 సీజన్. కీలకమైన మ్యాచ్‌లో స్వల్ప స్కోరుకే పరిమితమై, అధికారికంగా ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంది చెన్నై సూపర్ కింగ్స్. 10 మ్యాచుల్లో ఏడు మ్యాచుల్లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్, ఇక్కడి నుంచి ప్లేఆఫ్ చేరాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే..