బెన్ స్టోక్స్ దూరమవ్వడం రాజస్థాన్ రాయల్స్ కి పెద్ద షాక్..

Sep 17, 2020, 12:28 PM IST

ఐపీఎల్ 2020కి ఇంకా రెండు రోజులే ఉండడంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ ఎక్కువయ్యింది. ఇప్పటికే పలు జట్ల బలాలు, బలహీనతలు తెలుసుకున్నాం. ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ టీం ఎలా ఉందో చూద్దాం. రాజస్థాన్ రాయల్స్ మిగతా టీం లతో కంపేర్ చేస్తే అంతగా బాగా లేదు. అంతే కాదు ఈ జట్టు స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ వ్యక్తిగత కారణాల వల్ల ఈ సారి ఆడలేకపోవడం జట్టుకు పెద్ద మైనస్ గా మారబోతోంది. మంచి ఆటగాళ్లు ఉన్నా కూడా, 2008 ఇనాగరల్ ఇయర్ లో టైటిల్ గెలుచుకున్నా అంత ఇంప్రెసివ్ గా లేదంటున్నారు.. ప్రముఖ క్రికెట్ విశ్లేషకులు సి. వెంకటేష్ గారు.