Dec 27, 2022, 12:59 PM IST
పల్నాడు : పదేళ్ల మైనర్ పై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లాలో వెలుగుచూసింది. దాచేపల్లి మండలం కేశనపల్లి గ్రామంలో ఇంట్లో ఒంటరిగా వున్న చిన్నారిని ఐటిడిపి కోఆర్డినేటర్ వినుకొండ అశోక్ (23) అత్యాచారం చేయడానికి యత్నించాడు. అయితే ఈ కామాంధుడి వికృతచేష్టలతో భయపడిపోయిన బాలిక గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ఇళ్లవారు చేరుకుని కాపాడారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దాచేపల్లి పోలీసులు నిందితుడు అశోక్ ను అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై సంధ్యారాణి ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అభం శుభం తెలియని బాలికపై అఘాయిత్యానికి యత్నించిన యువకుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.