మద్యాన్ని తరలిస్తూ... రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ వైసిపి కార్పోరేటర్ అభ్యర్థి భర్త

Mar 5, 2021, 11:45 AM IST

విశాఖపట్నం: మున్సిపల్ ఎన్నికల్లోనూ మద్యం ఏరులై పారుతోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్ధులు భారీగా మద్యాన్ని నిల్వచేసుకుంటున్నారు. ఇలా గురువారం అర్ధరాత్రి భారీగా మద్యాన్ని ఇంటికి తరలిస్తూ అధికారపార్టీ కార్పోరేటర్ అభ్యర్థి భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో 47వ డివిజన్ వైస్సార్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి కాంటిపాము కామేశ్వరి భర్త గురూజ, సోదరులు కొరిబిల్లి విజయ్, కొరిబిల్లి నరసింగ్ ఓ కారు మరియు ఆటోలో 1700 పైచిలుక మద్యం సీసాలు తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. మద్యం సీసాలతో పాటు తరలించడాని ఉపయోగించిన వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.