పవన్ కళ్యాణ్ ఉద్యమంలో భాగమైన రేణు దేశాయ్, విడిపోయినా ఆలోచనల్లో ఒకటే 

First Published | Nov 25, 2024, 5:25 PM IST

పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ విడిపోయి చాలా కాలం అవుతుంది. అయితే పిల్లల కోసం అప్పుడప్పుడూ కలుస్తూ ఉంటారు. కాగా మాజీ భర్త పవన్ కళ్యాణ్ ని రేణు దేశాయ్ ఫాలో అవుతుంది. ఆయన అడుగుజాడల్లో నడుస్తుంది. ఏ విషయంలో అంటే..

Pawan Kalyan

హీరోయిన్ రేణు దేశాయ్ ని పవన్ కళ్యాణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బద్రి మూవీలో వీరిద్దరూ జంటగా నటించారు. ఆ మూవీ సెట్స్ లో ప్రేమ చిగురించింది. పవన్ కళ్యాణ్ తో లవ్ పడ్డాక రేణు దేశాయ్ సినిమాలకు గుడ్ బై చెప్పారు. వీరికి అకీరా, ఆద్య సంతానంగా పుట్టారు. 
 

Renu Desai

2012లో వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. అధికారికంగా విడాకులు తీసుకున్నారు. అనంతరం పలు సందర్భాల్లో రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. పిల్లలను తీసుకుని ఆమె పూణే వెళ్లిపోయారు. రేణు దేశాయ్ రెండో వివాహం చేసుకోవాలని ప్రయత్నించగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సోషల్ మీడియాలో ఆమె ట్రోల్స్ కి గురయ్యారు. 


కారణం తెలియదు కానీ.. రేణు దేశాయ్ రెండో పెళ్లి ఆలోచన పక్కన పెట్టేశారు. పిల్లల కోసం రేణు దేశాయ్-పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. గతంలో తరచుగా పవన్ కళ్యాణ్ పూణే వచ్చేవారని రేణు దేశాయ్ స్వయంగా చెప్పారు. ప్రస్తుతం రేణు దేశాయ్ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీలో జరిగే వేడుకలకు, ఫెస్టివల్ సెలబ్రేషన్స్ కి అకీరా, ఆద్య హాజరవుతారు. రేణు దేశాయ్ మాత్రం వెళ్ళరు. 

Pawan Kalyan and Akira Nandan

కాగా ఓ విషయంలో పవన్ కళ్యాణ్ ని చాలా సీరియస్ గా ఫాలో అవుతుంది రేణు దేశాయ్. అదే సనాతన ధర్మ పరిరక్షణ. ఎన్నికల్లో విజయం అనంతరం పవన్ కళ్యాణ్ లో ఆధ్యాత్మికత రెట్టింపు అయ్యింది. సనాతన ధర్మం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. తిరుపతి లడ్డు వివాదంలో ఆయన చాలా సీరియస్ అయ్యారు. సనాతన ధర్మం జోలికి వస్తే క్షమించేది లేదన్నారు. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్-పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. 

Renu Desai

ఇటీవల రేణు దేశాయ్ తల్లి కన్నుమూశారు. ఈ విషయం తెలిసిన అభిమానులు సంతాపం ప్రకటించారు. చాలా మంది RIP , రెస్ట్ ఇన్ పీస్ అని, కామెంట్స్ పెట్టారట. అది సబబు కాదని ఆమె అంటున్నారు. ఓం శాంతి, సద్గతి... అని కామెంట్ చేయాలట. అదే మన సనాతన ధర్మం అట. పండితులను అడిగితే ఆమెకు ఈ విషయం చెప్పారట. కాబట్టి ఇకపై సంతాపం ప్రకటించడానికి RIP అనే పదం వాడకండని ఆమె సూచించారు.  

ఈ క్రమంలో సనాతన ధర్మ పరిరక్షణలో మాజీ భర్త పవన్ కళ్యాణ్ ని రేణు దేశాయ్ ఫాలో అవుతుంది. ఆయన అడుగుజాడల్లో నడుస్తుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు రేణు దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. టైగర్ నాగేశ్వరరావు మూవీలో రేణు దేశాయ్ ఓ కీలక రోల్ చేసింది. మంచి పాత్రలు దొరికితే నటిస్తాను అంటున్నారు. 

Latest Videos

click me!