పిల్లలు బెడ్ మీద నుంచి కింద పడితే ఏం చేయాలి?

Published : Nov 25, 2024, 04:35 PM IST

  పిల్లలు కుదరుగా పడుకోలేరు. మనం జాగ్రత్తగా పడుకోపెట్టినా.. నిద్రలో కదులుతూ.. పొరపాటున మంచం మీద నుంచి కిందపడుతూ ఉంటారు. అలా వారు పడిపోయిన వెంటనే పేరెంట్స్ ఏం చేయాలో ఇఫ్పుడు తెలుసుకుందాం..

PREV
18
పిల్లలు బెడ్ మీద నుంచి కింద పడితే ఏం చేయాలి?

చిన్న పిల్లలు సోఫా మీద లేదా మంచం మీద పడుకుని నిద్రలో లేదా తెలియకుండానే పడిపోవడం సాధారణం. అలా పడిన వెంటనే పిల్లలు గట్టిగా ఏడుస్తారు. వెంటనే తల్లిదండ్రులు బాగా కంగారుపడిపోతారు.

28

చిన్నారి పడిపోయినప్పుడు ముందు ఏడుపు ఆపి ఎక్కడ గాయమైందో చూస్తాం. పిల్లలు ఏడుపు ఆపేసరికి అంతా బాగానే ఉందనుకుని డాక్టర్‌కి చూపించకుండా ఊరుకుంటాం. కానీ లోపల ఏమైనా అయ్యిందా అని ఆలోచించాలి.

38

పిల్లలు మంచం మీద నుంచి పడిపోయినప్పుడు ముందుగా గాయం ఎక్కడ అయ్యింది? గాయం ఎంత తీవ్రంగా ఉంది అని చూడాలి. రక్తస్రావం అవుతుందా లేదా దెబ్బ తగిలిందా అని తెలుసుకోవాలి.

48

ఏడుపు ఆగిన తర్వాత పిల్లలు నడిచే తీరు, కూర్చునే విధానం లేదా చాలా చిరాకు పడుతుంటే గాయం గురించి శ్రద్ధ వహించాలి. వెంటనే కోల్డ్ ప్రెస్ లేదా ఐస్ ప్యాక్ పెట్టాలి.

58

పిల్లలు పడిపోయిన కొద్ది నిమిషాల్లోనే వాంతులు చేసుకుంటే లేదా చాలా నిద్రపోతుంటే తప్పకుండా డాక్టర్‌ని సంప్రదించాలి. ఇది తల్లిదండ్రులకు మొదటి హెచ్చరిక.

68

ముఖ్యంగా మంచం లేదా సోఫా మీద నుంచి పడిపోయే పిల్లలకు తలకు దెబ్బ తగిలే అవకాశం ఎక్కువ. ఎత్తైన మంచం మీద పడుకోబెడితే పక్కన గట్టి దిండ్లు లేదా బొమ్మలు పెట్టాలి.

78

పిల్లలు పడిపోయినప్పుడు తల్లిదండ్రులు భయపడి స్కాన్ చేయించుకోవడానికి ముందుకు వస్తారు. కానీ చిన్న పిల్లలు చిన్న చిన్న గాయాలను తామే నయం చేసుకుంటారు. దృష్టి మరల్చినప్పుడు నొప్పి మర్చిపోతారు.

88

చాలా సున్నితమైన విషయం ఏమిటంటే పిల్లల ఎముకలకు దెబ్బ తగిలితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మోకాలు, మడమ, వేళ్లలో ఏదైనా తేడా కనిపిస్తే వెంటనే డాక్టర్‌కి చూపించాలి.

click me!

Recommended Stories