నెలరోజుల్లో 10కేజీల బరువు తగ్గాలా? ఇది ఫాలో అయితే చాలు

First Published | Nov 25, 2024, 4:59 PM IST

కేవలం నెల రోజుల్లో దాదాపు 10 కేజీల బరువు తగ్గవచ్చు. అది కూడా జిమ్ కి వెళ్లి చెమటలు చిందించకుండానే. మరి, అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాాం…

ఈ రోజుల్లో బరువు తగ్గాలని  చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తిండి తినడం మానేసి, కడుపు మాడ్చుకొని, ఏవేవో తిప్పలు పడుతూ ఉంటారు. దాని వల్ల బరువు తగ్గడం పక్కన పెడితే…అనేక రకాల రోగాలు తెచ్చుకుంటూ ఉంటారు.  ఇక.. కొందరు జిమ్ ల వెంట పరుగులు తీస్తూ ఉంటారు. దానిని రెగ్యులర్ గా కంటిన్యూ చేయలేక.. తమ బరువు తగ్గించుకోలేక బాధపడుతూ ఉంటారు. మీరు కూడా ఇదే పరిస్థితిలో ఉంటే.. కేవలం నెల రోజుల్లో దాదాపు 10 కేజీల బరువు తగ్గవచ్చు. అది కూడా జిమ్ కి వెళ్లి చెమటలు చిందించకుండానే. మరి, అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాాం…

weight loss

మీరు ఆరోగ్యకరంగా బరువు తగ్గాలి అంటే కచ్చితంగా వాకింగ్ చేయాలి. జిమ్ కి వెళ్లి కఠిన వ్యాయామాలు, బరువైన వస్తువులు ఎత్తకుండా కేవలం మీ ఇంటి సమీపంలో వాకింగ్ చేసి ఈజీగా బరువు తగ్గవచ్చు. అయితే.. వరసగా నాలుగు రోజులు వాకింగ్ చేసి తాము బరువు తగ్గలేదు అని అనుకోకూడదు. వరసగా నెల రోజులు క్రమం తప్పకుండా వాకింగ్ చేయాలి. మీరు ఎంత నడిస్తే అంత వేగంగా మీ శరీరంలోని క్యాలరీలు బర్న్ అవుతాయి.

Latest Videos


Benefits of Walking

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, మీరు ప్రతిరోజూ 1 మైలు లేదా 1.6 కిలోమీటర్లు నడిస్తే, మీ శరీరం 55 నుండి 140 కేలరీలు బర్న్ చేయగలదు. అయితే, ఇది మీ నడక వేగం మీద ఆధారపడి ఉంటుంది. అదే సమయంలో, బ్రిటీష్ నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకారం, మనం ప్రతిరోజూ 150 నిమిషాల పాటు కనీసం నడవాలట. 

Proper Walking

 ప్రతిరోజూ 10,000 అడుగులు నడవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.  అలాంటప్పుడు ఎన్ని రోజుల్లో ఎన్ని కిలోమీటర్లు నడిస్తే బరువు తగ్గుతారు అనే ప్రశ్న మీ మదిలో తలెత్తవచ్చు. దీనికి సరైన సమాధానం లేదు. ఎందుకంటే బరువు పెరగడానికి ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కారణాలు ఉండవచ్చు. అటువంటి పరిస్థితిలో, వారి బరువు వివిధ రేట్లు తగ్గుతుంది. కొంతమంది రోజూ 10000 అడుగులు నడవడం ద్వారా 1 నెలలో 10 కిలోల బరువు తగ్గుతారు. అదే సమయంలో, బరువు తగ్గడానికి 2 నెలలు కూడా తీసుకునే వ్యక్తులు కొందరు ఉన్నారు. ఎందుకంటే అనేక అంశాలు దీనికి కారణమని భావిస్తారు.

బరువు తగ్గడానికి, మీరు అనేక అంశాలపై పని చేయాలి

బరువు తగ్గడానికి, మీరు క్రమం తప్పకుండా నడవాలి. ఇది కాకుండా, కొన్ని ఇతర అంశాలకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి, అంటే క్రమంతప్పకుండా తీవ్రమైన వ్యాయామం చేయండి.

నడుస్తున్నప్పుడు, నడక వేగాన్ని పెంచాలి. గంటకు కనీసం 6 కిలోమీటర్లు అయినా నడవగలగాలి.

మీ బరువును నియంత్రించుకోవడానికి ఆహారంపై శ్రద్ధ వహించండి.

బయటి నుండి అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవద్దు.

తగినంత నీరు త్రాగాలి.

చక్కెర తీసుకోవడం తగ్గించాలి. మంచి గా నిద్రపోవాలి. ఇలా కనుక చేస్తే.. కచ్చితంగా మీ బరువులో తేడా మీరు చూస్తారు.

click me!