క్రిప్టో ఇండస్ట్రీలో జోష్ పెరిగి బిట్ కాయిన్ ధర ఆల్ టైమ్ రికార్డుకు చేరుకుంది. 2010 లో రూ.1000 బిట్ కాయిన్ ధర ఇప్పుడెంతో తెలిస్తే ఊహించలేరు...
బిట్ కాయిన్ విలువ రోజురోజుకు భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ జోరును చూసి ఆర్థిక నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 2010 లో బిట్ కాయిన్ కొనుగోలు చేసినవారికి ఇప్పుడు జాక్ ఫాట్ తగిలింది. అప్పుడు కేవలం రూ.1000 తో బిట్ కాయిన్ కొనుగోలు చేస్తే ఇప్పుడు దాని విలుదు రూ.2,450 కోట్లుగా వుంది.
2009 లో బిట్ కాయిన్ ను పరిగణలోకి వచ్చింది... అప్పట్లో దీన్ని పట్టించుకునేవారే లేరు. దీంతో ఒక్క కాయిన్ కేవలం $0.08 అంటే రూ.3.38 వద్ద ట్రేడ్ అయ్యేది. అంటే రూ.1000 కి రూ.295.85 విలువగల బిట్ కాయిన్స్ వుండేవన్నమాట. కాని రోజులు గడుస్తున్నకొద్ది ఈ బిట్ కాయిన్ విలువ పెరుగుతూ పోతూ ప్రస్తుతం ఆకాశాన్ని అంటింది.
undefined
2024 నవంబర్ అంటే ప్రస్తుతం బిట్ కాయిన్ 98,000 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. దీన్ని రూపాయల్లోకి మార్చితే 1 బిట్ కాయిన్ విలువ రూ.82,76.100. అంటే 2010 లో 1000 రూపాయలు పెట్టి బిట్ కాయిన్స్ కొనుగోలు చేస్తే ప్రస్తుతం వాటి విలువు ఏకంగా రూ.24,47,32,78,185 కోట్లు. కేవలం 14 ఏళ్లలోనే బిట్ కాయిన్ విలువ ఎన్నిరెట్లు పెరిగిందో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు.
2010-2024 వరకు బిట్ కాయిన్ జర్నీ :
2010 : 10,000 బిట్ కాయిన్స్ తో కేవలం రెండు పిజ్జాలు కొనేస్థాయిలో వుండేది.
2017 : ఈ సంవత్సరంలోనే క్రిప్టో బూమ్ మొదలయ్యింది. దీంతో బిట్ కాయిన్ విలువ $20,000 కు చేరుకుంది.
2020-2021 : టెస్లా, స్క్వేర్ వంటి దిగ్గజ కంపనీలు బిట్ కాయిన్ లో పెట్టుబడులు పెట్టడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
2024 : ఈ ఏడాదికి చేరుకునేసరికి బిట్ కాయిన్ ఆల్ టైమ్ రికార్డ్ హైకి చేరుకుంది. ఇక యూఎస్ ఎన్నికల ఫలితాలు, ట్రంప్ గెలుపు తర్వాత ఈ బిట్ కాయిన్ కు రెక్కలు వచ్చాయి. 98,000 డాలర్లకు బిట్ కాయిన్ విలువ చేరుకుంది.
బిట్ కాయిన్ ఎలా కొనుగోలు చేయాలి?
భారతీయులు బిట్ కాయిన్ కొనాలంటే వివిధ ప్లాట్ ఫార్మ్స్ ను ఉపయోగించవచ్చు. ఇందులో బినాన్స్, కాయిన్ స్విచ్, కాయిన్ డిసిఎక్స్, జెబ్ పే వంటివి వున్నాయి. ఈ యాప్స్ అన్ని క్రిప్టో కరెన్సీ వినియోగానికి ఛార్జీలను వసూలు చేస్తాయి.