రూ.5 లక్షల బడ్జెట్ లోనే ఎలక్ష్ట్రిక్ కారు ... ఒక్కసారి చార్జ్ చేస్తే 230 కి.మీ ప్రయాణం పక్కా

First Published | Nov 25, 2024, 4:18 PM IST

రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు భరించలేకపోతున్నారా? ఎలక్ట్రిక్ వాహనాల ధరలు వాచిపోతున్నాయా?... అయితే రూ.5 లక్షల లోపు ఎలక్ట్రిక్, రెగ్యులర్ కార్లు బెస్ట్ ఆప్షన్ ...వీటి గురించి ఇక్కడ తెలుసుకోండి.

5 లక్షల లోపు ఫ్యామిలీ ఎలక్ట్రిక్ కార్

బడ్జెట్‌ ధరలో కారు కొనాలనుకుంటున్నారా? అదీ ఎలక్ట్రికల్ కావాలనుకుంటున్నారా? అయితే రూ.5 లక్షల లోపు చక్కని ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో పెట్రోల్, సిఎన్జితో పాటు ఎలక్ట్రిక్ కార్లు కూడా వున్నాయి...మీ అవసరాలకు తగ్గ కార్ ఇక్కడ దొరుకుతుంది. ఈ వివరాలు సరైన కార్ ఎంచుకోవడానికి మీకు సహాయపడతాయి.

మారుతి సుజుకి ఆల్టో K10

మారుతి సుజుకి ఆల్టో K10 చాలా తక్కువ ధర, మంచి మైలేజ్ కలిగిన కారు. ఇది బడ్జెట్ ప్రెండ్లీ కావడంతో కొనుగోలుదారులకు ఎంతో ఇష్టమైనది. పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ 24.39 km/l, ఆటోమేటిక్ 24.90 km/l, CNG వెర్షన్ 33.85 km/kg మైలేజ్ ఇస్తుంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.3.99 లక్షల నుండి రూ.5.96 లక్షల వరకు ఉంటుంది.


MG కామెట్ EV

MG కామెట్ EV అతి తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ వాహనాల్లో ఒకటి. MG BaaS (బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్) ప్లాన్ కింద ఎక్స్-షోరూమ్ ధర రూ.4.99 లక్షలు. ఫుల్ ఛార్జ్‌తో 230 కి.మీ. వెళ్తుంది. 3.5 గంటల్లో 0 నుండి 100% వరకు ఛార్జ్ అవుతుంది. బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లో కిలోమీటరుకు రూ.2.5 చెల్లించాలి. సబ్‌స్క్రిప్షన్ లేకుండా కొంటే ఎక్స్-షోరూమ్ ధర రూ.6.98 లక్షలు.

రెనాల్ట్ క్విడ్

రెనాల్ట్ క్విడ్ స్టైలిష్, ప్రాక్టికల్ హ్యాచ్‌బ్యాక్. బేస్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.4.69 లక్షలు, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.6.44 లక్షలు. రూ.5 లక్షల లోపు RXE 1.0L, RXL(O) 1.0L, RXL(O) నైట్ & డే ఎడిషన్ 1.0L వేరియంట్లు ఉన్నాయి. ఈ కారు 21.46 నుండి 22.3 km/l మైలేజ్ ఇస్తుంది.

చౌకైన ఎలక్ట్రిక్ కార్లు

నమ్మకమైన, సమర్థవంతమైన వాహనం కొనడానికి ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదని ఈ కార్లు నిరూపిస్తున్నాయి. మీ బడ్జెట్, అభిరుచులకు తగ్గ కారును పైన ఇచ్చిన బడ్జెట్ కార్ల నుండి ఎంచుకోవచ్చు.

Latest Videos

click me!