గుంటూరులో మహిళా మాక్ పార్లమెంట్..: ఏపీ మహిళా కమీషన్ ఛైర్మన్ ప్రకటన

Mar 2, 2022, 3:23 PM IST

గుంటూరు: ఈనెల 4వ తేదీన అంటే వచ్చే శుక్రవారం గుంటూరు జిల్లాలో జాతీయ మహిళా కమిషన్, రాష్ట్ర మహిళా కమిషన్ సంయుక్తంగా మహిళా మాక్ పార్లమెంట్ నిర్వహించనున్నట్లు ఏపీ మహిళా కమీషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ ప్రకటించారు. ఆచార్య  నాగార్జున యూనివర్సిటీలో ఈ కార్యక్రమం జరపనున్నట్లు ఆమె తెలిపారు. మహిళలకు అన్ని రకాల సమస్యలపై, చట్టాలను ఎలా అమలు అవుతాయనే అంశాలపై అవగాహన కల్పించడమే కాదు ఐదు రకాల అంశాలపై ఈ మహిళా పార్లమెంట్లో చర్చించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎన్జీవోలు, న్యాయవాదులు, విద్యార్థులు పాల్గొంటారని వాసిరెడ్డి పద్మ వెల్లడించారు.