Jan 23, 2022, 10:50 AM IST
విజయవాడ: సంక్రాంతి పండగ సందర్భంగా గుడివాడలోని తన కళ్యాణ మండపంలో క్యాసినో, పేకాట వంటివి నిర్వహించినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేసి, పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానన్న మంత్రి కొడాలి నాని సవాల్ ను కృష్ణా జిల్లాకు చెందిన ఓ మహిళ స్వీకరించింది. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని సవాల్ చేసిన బూతుల మంత్రి ఎక్కడున్నావు...? అని మహిళ ప్రశ్నించారు.
''రాష్ట్రంలో ప్రజలందరూ నీ జూద క్రీడని చూసారు. సంక్రాంతి ముసుగులో వందల కోట్ల నీ దోపిడీని నిరూపించాము. పెట్రోల్ తో మేము సిద్ధం... నువ్వు సిద్ధమా?'' అంటూ మహిళ పెట్రోల్ బాటిల్ చేతపట్టి మంత్రి కొడాలి నానికి సవాల్ విసిరారు.