Jul 11, 2020, 10:44 AM IST
వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్య కేసులో అరెస్టైన టీడీపీ నేత కొల్లు రవీంద్ర కుటుంబాన్ని టీడీపీ నేతలు పరామర్శించారు. శాసన సభ్యులు అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావులు మచిలీపట్నంలోని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెలుగు దేశం నేతలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తోందన్నారు. కొల్లు రవీంద్ర చీమకైనా హాని చేయని వ్యక్తి అని, అలాంటి వ్యక్తి ఈ పని చేశాడంటే ఎవ్వరూ నమ్మరన్నారు.