పెట్రోల్: డీజిల్: ఎలక్ట్రిక్ కార్లలో ఏది కొంటే ఎక్కువ ఉపయోగమో తెలుసా?

First Published | Dec 11, 2024, 4:44 PM IST

ఈ రోజుల్లో కారు అందరికీ చాలా అత్యవసరమైన వస్తువే. మన దేశంలో కార్ల వినియోగం కూడా బాగా పెరిగింది. అందుకే విదేశాలకు చెందిన ఎన్నో కంపెనీలు ఇక్కడ తమ కార్లను విడుదల చేస్తూ మంచి మార్కెట్ సంపాదిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ కార్లే కాకుండా ఎలక్ట్రిక్ కార్లు కూడా ఇండియాలో ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. వాటి ధరలు కూడా పోటాపోటీగా తగ్గిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఎలాంటి కారు కొనాలా అని డౌట్ ఉంటుంది. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ కార్లలో ఏది కొంటే మీకు ఎక్కువ ఉపయోగంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

సాధారణంగా కారు కొనాలంటే వాటి ధరలనే అందరూ  ఎక్కువగా గమనిస్తారు. అయితే ధరలు మాత్రమే కాదు.. మెయింటనెన్స్ ఖర్చులు, ఇంధన ధరలు, రిపేర్లు ఇలా చాలా అంశాలు కార్ల కొనుగోలుపై ప్రభావం చూపుతాయి. ఇక కార్ల ధరల విషయానికొస్తే సాధారణంగా పెట్రోల్ తో నడిచే కార్లు తక్కువ ధర ఉంటాయి. డీజిల్ తో నడిచే కార్లు ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి. ఎలక్ట్రిక్ కార్లయితే ఈ రెండిటి కంటే ఎక్కువగా ఉంటాయి. కాని ఎలక్ట్రిక్ వెహికల్స్ కి మెయింటనెన్స్ ఖర్చు తక్కువగా ఉంటుంది. పెట్రోల్, డీజిల్ కార్లకు మెయింటనెన్స్ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. 
 

Tata Motors, Hyundai, Mahindra, Volkswagen, MG Motors కంపెనీలు పెట్రోల్, డీజిల్ కార్లతో పాటు ఎలక్ట్రికల్ వెహికల్స్ ని కూనడా తయారు చేస్తున్నాయి. Toyota కంపెనీ హైబ్రిడ్ మోడల్స్ తో పాటు ఎలక్ట్రిక్ వెహికల్స్ ని తయారు చేస్తోంది. ఇక Honda కంపెనీ హైబ్రిడ్ మోడల్స్ తో పాటు పెట్రోల్ కార్లు తయారు చేస్తోంది. 
 

Tap to resize

ధరల్లోనే రూ.లక్షలు తేడా..
ఎలక్ట్రిక్ వెహికల్స్ తో పోల్చితే పెట్రోల్, డీజిల్ కార్లు తక్కువ ధరకే లభిస్తాయి. ఉదాహరణకు టాటా కంపెనీకి చెందిన నెక్సాన్ కారును తీసుకుంటే.. ఇది పెట్రోల్ వెర్షన్ బేస్ మోడల్ ధర రూ.8 లక్షలు ఉంది. ఇదే కంపెనీకి చెందని డీజిల్ తో నడిచే బేస్ మోడల్ కారు రూ.10 లక్షలు ఉంది. అదే ఎలక్ట్రిక్ కారు అయితే ఏకంగా రూ.12.5 లక్షలు ఉంది. ఈ రేట్లు చూస్తే ఎవరైనా పెట్రోల్ వెర్షన్ కొనుక్కోవాలని అనుకుంటారు.  అయితే మెయింటనెన్స్ ఖర్చులు కూడా కలిపితేనే గాని ఏది కొనుక్కోవచ్చో క్లారిటీకి రాకూడదు. 
 

మెయింటనెన్స్ ఖర్చులు ఎలా?
ఎలక్ట్రిక్ వెహికల్స్ తో పోలిస్తే పెట్రోల్, డీజిల్ కార్లు తక్కువ ధరకే లభించినా వీటికి మెయింటనెన్స్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అంటే.. లీటరు పెట్రోల్ ప్రస్తుతం దాదాపు రూ.107 రూపాయలు ఉంది. అదే డీజిల్ అయితే సుమారు రూ.96 వరకు అమ్ముతున్నారు. పెట్రోల్ అయితే లీటరుకు 17 నుంచి 21 వరకు ఇచ్చే కార్లున్నాయి. డీజిల్ అయితే 20 నుంచి 25 వరకు ఇచ్చే కార్లున్నాయి. ఈ లెక్కన కి.మీ. పెట్రోల్ కారయితే సుమారు రూ.6 నుంచి రూ.7 ఖర్చవుతుంది. డీజిల్ కారయితే దాదాపు రూ.4 వరకు ఖర్చవుతుంది. మరి ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే కి.మీ. కేవలం 50 పైసల నుంచి 80 పైసల మధ్య ఖర్చవుతుంది. 
 

ఎలక్ట్రిక్ వెహికల్స్ తో పోల్చి చూస్తే పెట్రోల్, డీజిల్ కార్లకు మెయింటనెన్స్ ఎక్కువగా ఉంటుంది. సర్వీసింగ్, ఆయిల్ ఛేంజింగ్ లాంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఈ ఇబ్బంది ఉండదు. కాని ఒకసారి బ్యాటరీ కంప్లయింట్ వస్తే రూ.లక్షల్లో ఖర్చయిపోతుంది. అయితే వారెంటీ ఉన్నవి, ఇన్యూరెన్స్ ఉన్న వెహికల్స్ కొనుక్కుంటే మీకు కలిసి వస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఛార్జింగ్ పాయింట్లు ఎక్కువగా లేవు. అయినా ఛార్జింగ్ పెట్టాలంటే కనీసం 4, 5 గంటలు పెట్టాలి. అదే పెట్రోల్, డీజిల్ కార్లయితే ఏ పెట్రోల్ బంకులో అయినా ఆయిల్ కొట్టించుకొని వెళ్లిపోవచ్చు. ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఈ అవకాశం ఉండదు. అందువల్ల ఈ విషయాలన్నీ పరిశీలించి మీ బడ్జెట్, మెయింటనెన్స్, భవిష్యత్తులో రానున్న మార్పులను కూడా పరిశీలించుకొని పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వెహికల్స్ లో మీకు ఉపయోగంగా ఉండే వాటిని కొనుక్కోవడం మేలు.   
 

Latest Videos

click me!