జామ గింజలు తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | Dec 11, 2024, 4:22 PM IST

జామకాయను తింటూ దానిలోని గింజల్ని కూడా అలాగే తినేస్తుంటాం. కానీ ఈ గింజల్ని తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

Guava

జామ కాయలు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిని తినడం వల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషకాలు ఉందుతాయి. అందుకే ఈ పండ్లను ఖచ్చితంగా తినాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతారు. అయితే జామకాయల్ని తినేటప్పుడు ఖచ్చితంగా దాని గింజల్ని కూడా నమిలేసి అలాగే మింగేస్తుంటాం. కానీ ఈ జామ గింజల్ని తింటే ఏం జరుగుతుందన్న ముచ్చట మాత్రం ఎవ్వరికీ తెలియదు. 


ఆరోగ్య నిపుణుల ప్రకారం..జామ గింజల్లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫినోలిక్ యాసిడ్స్, పొటాషియం మొదలైనవి పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే వీటిని జీర్ణం చేసుకోవడానికి మన జీర్ణవ్యవస్థ చాలా కష్టపడాల్సి ఉంటుంది. అసలు ఈ జామ గింజల్ని తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

Tap to resize


మలబద్ధకం నుంచి ఉపశమనం 

జామ గింజల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అందుకే ఈ గింజల్ని తినడం వల్ల మనకు మలబద్దకం నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే పేగుల్లో ఉన్న మురికి కూడా బయటకు వెళ్లిపోతుంది. జామ గింజలు జీర్ణ సమస్యలను పరిష్కరించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 

గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది 

జామ గింజలు మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. ఎలా అంటే ఈ గింజల్లో పుష్కలంగా పొటాషియం ఉంటుంది. ఇది మన శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.

guava

బరువును తగ్గిస్తుంది

జామ గింజలు బరువు తగ్గాలనకునే వారికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల మీ బరువు అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జామ గింజల్ని తింటే మీ శరీరానికి అవసరమైన ఫైబర్ అందుతుంది. అలాగే బరువు కూడా అదుపులో ఉంటుంది. 

డయాబెటిస్ పేషెంట్లకు  మేలు

జామ గింజలు డయాబెటీస్ పేషెంట్లకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఎలా అంటే ఈ గింజల్లో ఉండే ప్రోటీన్లు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి బాగా సహాయపడతాయి. అందుకే జామకాయల్ని డయాబెటీస్ ఉన్నవారు ఖచ్చితంగా తినాలని డాక్టర్లు చెప్తారు.


జీర్ణక్రియ అవాంతరాలు 

జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉన్నవారికి, విరేచనాల సమస్య తరచుగా వచ్చేవారికి జామ గింజలు మంచివి కావు. ఎందుకంటే ఇవి ఈ సమస్యలను మరింత పెంచుతుంది. అలాగే జామ కాయల్ని ఉదయాన్నే పరిగడుపున తింటే లూజ్ మోషన్స్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.

అలాగే మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు కూడా జామ గింజల్ని తినకూడదంటారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే దీనివల్ల కిడ్నీ స్టోన్స్ మరింత పెరుగుతాయి. అలాగే అపెండిసైటిస్ ప్రమాదం ఉన్నవారు కూడా జామ గింజల్ని తినకూడదు. ఎందుకంటే ఈ గింజలు అపెండిక్స్ కు అంటుకుపోతాయి. దీంతో మీ సమస్య మరింత పెరుగుతుంది. 

Latest Videos

click me!