మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, మోహన్ బాబు లాంటి సీనియర్ నటుల కుటుంబాల్లోకి కోడళ్ళు వచ్చేశారు. అయితే టాలీవుడ్ కి చెందిన ప్రముఖుల కోడళ్లలో ఎవరు ఎక్కువ ధనవంతులు అనే చర్చ జరుగుతోంది మోహన్ బాబు కుటుంబంలో ఆస్తి గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మంచు మనోజ్, భూమా మౌనిక దంపతులు ఈ గొడవల్లో సంచలనంగా మారారు. దీనితో టాలీవుడ్ లో ఉన్న సెలెబ్రిటీల కోడళ్లలో ఎవరి ఆస్తి ఎంత ఉంది అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
చిరంజీవి కోడలు ఉపాసన
టాలీవుడ్ లో సెలెబ్రిటీల కోడళ్లలో నిస్సందేహంగా మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన అత్యధిక ఆస్తులు కలిగిన ధనవంతురాలు. ఆమె తాత ప్రతాప్ రెడ్డి ఇండియాలోని బిలినియర్స్ లో ఒకరు. అపోలో ఆసుపత్రుల అధినేత ఆయన. వీరి ఆస్తి విలువ 25 వేల కోట్ల వరకు ఉంది. ఇందులో ఉపాసన ఆస్తులు కూడా భారీ మొత్తంలో ఉన్నాయి. ఇక ఆమె భర్త రాంచరణ్ ఆస్తులు 1300 కోట్ల వరకు ఉన్నాయి. ఇండియాలో రిచెస్ట్ సెలెబ్రిటీ కపుల్స్ లో చరణ్, ఉపాసన జంట ఉంటారు.
నాగార్జున కోడలు శోభిత
శోభిత ధూళిపాల రీసెంట్ గా నాగ చైతన్యని పెళ్లి చేసుకుని అక్కినేని కోడలుగా మారింది. శోభిత మోడలింగ్ తో కెరీర్ ప్రారంభించింది. అనేక కమర్షియల్ యాడ్స్ లో నటించింది. ఆమె సినిమాకి 70 లక్షల పైగా రెమ్యునరేషన్ అందుకుంటుంది. శోభిత ఇప్పటి వరకు 10 కోట్ల వరకు ఆస్తులు సంపాదించినట్లు తెలుస్తోంది. నాగార్జున ఆస్తుల విలువ 4 వేల కోట్ల వరకు ఉంటాయి. అంటే చైతన్యకి వచ్చే వాటా 2000 కోట్ల వరకు ఉంటుంది. అంటే శోభిత కూడా ధనవంతురాలు అయినట్లే.
Also Read: వయసుకన్నా గౌరవం ఇవ్వాల్సింది, లెజెండ్రీ నటిని ఆ జంతువుతో పోల్చి దారుణంగా అవమానించిన జమున
కృష్ణ కోడలు నమ్రత
సూపర్ స్టార్ కృష్ణ కోడలు, మహేష్ బాబు సతీమణి నమ్రతకి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ బాగానే ఉంది. ఆమె తల్లిదండ్రులు ముంబైలో అత్యంత ధనవంతులుగా ఉన్నారు. నమ్రత పేరుపై 50 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.
అల్లు అరవింద్ కోడలు అల్లు స్నేహ రెడ్డి
అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఆమె తండ్రి చంద్రశేఖర్ రెడ్డి తెలంగాణలో ప్రముఖ పొలిటీషియన్ గా రాణిస్తున్నారు. ఆమె పేరుపై వ్యాపారాలు కూడా ఉన్నాయి. 40 కోట్లకి పైగా అల్లు స్నేహకి ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.
మోహన్ బాబు కోడళ్ళు - విరోనికా, భూమా మౌనిక
మోహన్ బాబు పెద్ద కొడుకు మంచు విష్ణు సతీమణి విరోనికా రెడ్డికి రాజకీయ నేపథ్యం ఉంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీతో ఆమెకి బంధుత్వం ఉంది. ఆమె ఆస్తుల విలువ 10 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చిన్న కొడుకు మంచు మనోజ్ సతీమణి భూమా మౌనిక రెడ్డి కుటుంబం గురించి ఏపీ రాజకీయాల్లో తెలియని వారు ఉండరు. ఆమె తల్లి శోభా నాగిరెడ్డి, తండ్రి భూమా నాగిరెడ్డి ఇద్దరూ కర్నూలు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తుల ప్రకారం.. భూమా మౌనికకి 1500 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఉపాసన తర్వాత టాలీవుడ్ ప్రముఖుల కోడళ్లలో అంతటి రిచెస్ట్ కోడలిగా భూమా మౌనిక పేరు చెబుతున్నారు.