Feb 11, 2023, 11:45 AM IST
గుంటూరు : సంక్షేమ పథకాలను అందుకుంటున్న ఇళ్లకు వాలంటీర్లతో మా నమ్మకం నువ్వే జగన్ అంటూ స్టిక్కర్లు అతికించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ద్వారా ఓటమి భయంతో వైసీపీ ప్రభుత్వం ఎంతగా ఆందోళన చెందుతుందో అర్ధమవుతుందని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. తన పాలనపై ప్రజలు నమ్మకం కోల్పోయారని గ్రహించిన జగన్ కి మతిభ్రమించి ఇలాంటి తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.శుక్రవారం శ్రీనివాసరావుతోటలోని గాజుగ్లాస్ దిమ్మెవద్ద నువ్వు నిన్ను మేం నమ్మం మా దరిద్రం నువ్వే జగన్ అంటూ స్టిక్కర్లను విడుదల చేసారు. చిన్నపిల్లలకి చాక్లెట్ ఇచ్చి నక్లెస్ లాక్కున్నట్లుగా రాష్ట్ర ఆదాయంలోంచి ప్రజలకు కాస్త పంచిపెట్టి తాము మాత్రం రాష్ట్ర సంపదను ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. తాము కూడా ప్రజల అనుమతితో నువ్వే మా రాష్ట్రానికి మా జీవితాలకి పట్టిన దరిద్రం జగన్ స్టిక్కర్లను ఇళ్లకు అతికిస్తామన్నారు.