ఏపీ యువతకు మేకపాటి గుడ్ న్యూస్.. స్కిల్డ్ కోర్సుల్లో అవకాశాలు..

Jun 3, 2020, 12:36 PM IST

నైపుణ్యం కలిగిన మానవ వనరులే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బలమని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో ఏ రంగంలోనైనా  పెట్టుబడులు పెట్టే అనుకూలమైన వాతావరణం , సహజవనరులు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత అని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా కర్ణాటక, తమిళనాడు, కర్ణాటక సహా పలు రాష్ట్రాలకు చెందిన  ఐ.టీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రులు, కార్యదర్శులతో ‘ఇన్వెస్ట్ ఇండియా ఎక్స్ క్లూజివ్ ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్’ నిర్వహించిన వెబినార్ లో ఆంధ్రప్రదేశ్ తరపున పరిశ్రమలు, ఐ.టీ, వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు.