Feb 16, 2023, 12:01 PM IST
అనకాపల్లి : మా తల్లిదండ్రులు మాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు... ఎంతో కష్టపడి చదివిస్తున్నారు... కానీ ఇక్కడ కనీసం చదువుకునే పరిస్థితి కూడా లేదంటూ ఏపీకి చెందిన ఓ కస్తూర్భా స్కూల్ విద్యార్థినులు కన్నీరు పెట్టుకుంటూ సమస్యలు వివరించారు. అనకాపల్లి జిల్లా లింగరాజుపాలెం కస్తుర్భా పాఠశాల విద్యార్థినుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి చూసేవారితో కన్నీరు పెట్టిస్తోంది. ఎంతో గొప్పగా చదువు చెబుతారని ఇక్కడ చేరామని... కానీ ఆ పరిస్థితి లేదంటూ అమ్మాయిలు కన్నీటిపర్యంతం అయ్యారు. ఈ చిన్నారుల కన్నీల్లను చూసయినా రెసిడెన్షియల్ కస్తూర్భా స్కూల్ సమస్యలను పరిష్కరించాలని నెటిజన్లు కోరుతున్నారు.