సెకండ్ హాఫ్ మొత్తం రేసీ స్క్రీన్ ప్లే తో పరుగులు పెడుతుందట. సెకండ్ హాఫ్ లో మొత్తం 3 మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. ఆ మూడు యాక్షన్ సీన్స్ పై చిత్ర యూనిట్ ఒక రేంజ్ లో నమ్మకం పెట్టుకుని ఉన్నారు. ఫస్ట్ హాఫ్ లో ఒక యాక్షన్ ఎపిసోడ్, సెకండ్ హాఫ్ లో మూడు వర్కౌట్ అయితే బాహుబలి, కెజిఎఫ్, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలని అవలీల గా అధికమిస్తుంది అని నమ్మకంతో ఉన్నారు. యాక్షన్, విజువల్ థ్రిల్ చేసేలా ఉంటాయట. సుకుమార్ పుష్ప 3 ప్లానింగ్ లో కూడా ఉన్నారు. ఒక భారీ ట్విస్ట్ తో పుష్ప 3కి లీడ్ ఇచేలా మూవీ ముగుస్తుంది అని చెబుతున్నారు.